ఆసీస్ స్టార్ ప్లేయర్ సంచలన నిర్ణయం.. ఫామ్లో ఉండగానే..
X
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ షాన్ మార్ష్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రొఫెషనల్ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్కు గుడ్ బై చెప్పిన మార్ష్.. తాజాగా అన్ని ఫార్మాటర్లకు వీడ్కోలు పలికాడు. మార్ష్ ప్రస్తుతం బిగ్ బాష్ లీగ్లో ఆడుతున్నాడు. జనవరి 16న సిడ్నీ థండర్స్‌తో జరిగే మ్యాచే తనకు చివరిదని స్పష్టం చేశాడు. మార్ష్ ఫామ్లో ఉండగానే రిటైర్మెంట్ ప్రకటించడంతో ఫ్యాన్స్ షాకయ్యారు. ఇక గత మ్యాచులో మెల్ బోర్న్ స్టార్స్పై 64 రన్స్ చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ సాధించాడు.
2001లో మార్ష్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 17 ఏళ్ల వయస్సులో క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు 40ఏళ్లకు రిటైర్ అవుతున్నాడు. ఆస్ట్రేలియా తరఫున 38 టెస్టులు, 73 వన్డేలు,15 టీ20లు ఆడాడు. ఇక 2008 నుంచి 2017 వరకు ఐపీఎల్లో ఆడారు. మార్ష్ను ఐపీఎల్ ఫస్ట్ సూపర్ స్టార్ అంటారు. ఎందుకంటే ఐపీఎల్ తొలి సీజన్లోనే 616 రన్స్ చేసి అదరగొట్టాడు. మొత్తం ఐపీఎల్లో 71 మ్యాచులు ఆడిన మార్ష్.. 2477 రన్స్ చేశారు. ఇక ఇంతకాలం తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి మార్ష్ థ్యాంక్స్ చెప్పాడు. షాన్ మార్ష్ సోదరుడు మిచెల్ మార్ష్ ఆసీస్ జట్టులో ప్రస్తుతం కీలక ప్లేయర్గా కొనసాగుతున్నాడు.