షాకింగ్.. మ్యాచ్ జరుగుతుండగా 13 మంది క్రికెటర్లకు అస్వస్థత
X
పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచ్ జరుగుతుండగా 13 మంది క్రికెటర్లు అస్వస్థతకు గురయ్యారు. పీఎస్ఎల్ 2024 సీజన్ టోర్నీలో క్రికెటర్లు అస్వస్థతకు గురవ్వడంతో గందరగోళం నెలకొంది. ఏకంగా 13 మంది ప్లేయర్లు అస్వస్థతకు గురవ్వడంతో నిర్వాహకులు అలర్ట్ అయ్యారు. కరాచీ కింగ్స్ జట్టుకు సంబంధించిన 13మందిని ఆస్పత్రికి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా మారింది. ప్లేయర్లంతా కడుపు నొప్పి, వాంతులతో బాధపడ్డారు.
ఫుడ్ పాయిజనింగ్ కారణంగానే క్రికెటర్లు అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో తుది జట్టు ఎంపికకు కాస్త సమయం పట్టింది. క్వెట్టా గ్లాడియేటర్స్‌తో కరాచీ కింగ్స్ తలపడ్డారు. ఈ మ్యాచ్‌లో క్వెట్టా ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని పొందింది. మ్యాచ్ ప్రారంభం అవ్వడానికి ముందే జట్టులోని ఆటగాళ్లంతా అస్వస్థతకు గురయ్యారు. మ్యాచ్ ప్రారంభానికి ముందే కెప్టెన్ షాన్ మసూద్, షోయబ్ మాలిక్, హసన్ అలీతో పాటు మరికొందరు ఆటగాళ్లు కోలుకున్నారు. దీంతో తుడి జట్టులో నాలుగు మార్పులతో కరాచీ కింగ్స్ జట్టు బరిలోకి దిగింది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన క్వెట్టా జట్టు కేవలం ఐదు వికెట్లు కోల్పోయి విజయాన్ని పొందింది.
6️⃣ HITTING PARTY IN KARACHI 💥
— PakistanSuperLeague (@thePSLt20) February 29, 2024
Sherfane Rutherford is smashing them into the stands 🚀#HBLPSL9 | #KhulKeKhel | #KKvQG pic.twitter.com/N5UNsfqPKy