వరల్డ్ కప్‌లో తిలక్ వర్మకి చోటివ్వాలని పెరుగుతున్న డిమాండ్‌లు
X
భారత్ క్రికెట్ అభిమానుల్లో ప్రస్తుతం మార్మోగుతున్న పేరు తిలక్ వర్మ. ఐపీఎల్‌లో రాణించి భారత్ జట్టులో చోటు సంపాదించిన ఈ 21 ఏళ్ల ఆటగాడు విండీస్ పై అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. మూడు మెరుపు ఇన్నింగ్స్ ల్లో 39, 51 మరియు 49* స్కోర్‌లతో విజృంభించాడు. T20Iలలో తన మొదటి మూడు ఇన్నింగ్స్‌లలో 30-ప్లస్ స్కోర్‌లు సాధించిన రెండవ భారతీయ బ్యాటర్‌గా నిలిచాడు. టాప్ ఆర్డర్‌లో ఎడమచేతి వాటం బ్యాటర్ కోసం చూస్తున్న భారత్‌కు తిలక్ వర్మ ఓ ఆశాజ్యోతిగా కనిస్తున్నాడు.తిలక్ వర్మ బ్యాటింగ్‌పై దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి.
విండీస్‌పై తిలక్ వర్మ ప్రదర్శన తర్వాత కొత్త డిమాండ్‌లు మొదలయ్యాయి. వన్డే ప్రపంచ్ కప్ కోసం తిలక్ వర్మని ఎంపిక చేయాలని తమ గళాన్ని వినిపిస్తున్నారు. వన్డే వరల్డ్ కప్‌కు మరో రెండు నెలల సమయం ఉంది. అయితే కీలక ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ పునరాగమనంపై క్లారిటీ లేదు. దీంతో కీలకమైన నాలుగో స్థానంలో ఆడే ప్లేయర్ కోసం టీమిండియా అన్వేషణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీ20ల్లో సత్తాచాటుతున్న తిలక్ వర్మ.. వన్డేల్లోనూ రాణించగలడని.. మెగా టోర్నీకి అతడిని ఎంపిక చేయాలనే డిమాండ్‌లు వినిపిస్తున్నాయి.
మాజీ చీఫ్ సెలెక్టర్ MSK ప్రసాద్ కూడా ఇచే విషయాన్ని చెప్పాడు. విభిన్న పరిస్థితుల్లో ఆడే సామర్థ్యం ఉన్న తిలక్ వర్మను వరల్డ్ కప్ కోసం పరిగణలోకి తీసుకోవాలని సూచించాడు. టాప్ ఆర్డర్ లో ఈ లెఫ్ట్ హ్యాండర్ చక్కగా సరిపోతాడని తెలిపాడు. ఒకవేళ శ్రేయాస్ అయ్యర్ ఫిట్‌గా లేకుంటే అతడి స్థానంలో తిలక్‌కు ఆడించాలని ఎమ్మెస్కే సూచించారు. తిలక్‌ను ఆస్ట్రేలియా లెజెండరీ ఆటగాడు మైఖేల్ బెవన్‌తో పోల్చిన ఎమ్మెస్కీ ప్రసాద్.. అవసరాన్ని బట్టి గేర్ మార్చి విరుచుకుపడగల నైపుణ్యం అతని దగ్గర ఉందని ప్రశంసించారు.ఏ రకంగా చూసినా తిలక్ వరల్డ్ కప్‌లో ఆడేందుకు అన్ని విధాలా అర్హుడు’ అని ప్రసాద్ వెల్లడించాడు.
టీమిండియా మాజీ ప్లేయర్ వసీం జాఫర్ కూడా తిలక్ వర్మపై ఆసక్తికర కామెంట్లు చేశాడు. తిలక్ వర్మ ఆట తనను ఆకట్టుకుందని.. వన్డేలకు కూడా సరిపోతాడని చెప్పుకొచ్చాడు. శ్రేయస్ అయ్యర్, రాహుల్ పునరాగమనంపై స్పష్టత లేనప్పుడు.. లెఫ్ట్ హ్యాండర్ అయిన తిలక్ వర్మను ఎందుకు ఎంపిక చేయకూడదనే అభిప్రాయం వ్యక్తం చేశాడు.