Home > క్రీడలు > సెంచరీలతో చెలరేగిన శ్రేయస్, రాహుల్.. నెదర్లాండ్ ముందు కొండంత లక్ష్యం

సెంచరీలతో చెలరేగిన శ్రేయస్, రాహుల్.. నెదర్లాండ్ ముందు కొండంత లక్ష్యం

సెంచరీలతో చెలరేగిన శ్రేయస్, రాహుల్.. నెదర్లాండ్ ముందు కొండంత లక్ష్యం
X

వన్డే ప్రపంచ కప్‌లో చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు సత్తా చాటారు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా భారత్‌ - నెదర్లాండ్స్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న రోహిత్ సేన నెదర్లాండ్స్ బౌలర్లకు చుక్కులు చూపించింది. టాప్‌ ఆర్డర్‌లోని బ్యాటర్లందరూ రాణించడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 410 పరుగులు చేసింది. నెదార్లాండ్ ఎదుట 411 పరుగుల భారీ లక్ష్యం ఉంచింది.

టీమిండియా బ్యాటర్లు మ్యాచ్ ప్రారంభం నుంచి దూకుడుగా ఆడారు. కెప్టెన్ రోహిత్ శర్మ 54 బాల్స్లో 8ఫోర్లు, 2 సిక్సర్లతో 61 రన్స్ చేశాడు. శుభ్ మన్ గిల్ 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. 11.5 ఓవర్లలో వీరు 100 పరుగుల భాగస్వామ్యం చేశారు. వాన్‌ మాకీరన్‌ బౌలింగ్‌లో తేజకు క్యాచ్‌ ఇచ్చి గిల్‌ వెనుదిరిగగా.. కొద్దిసేపటికే రోహిత్‌ శర్మ కూడా బాస్‌ డీ లీడా బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ 56 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ తో 51 రన్స్ చేశారు. హాఫ్ సెంచరీతో జోరుమీదున్న కోహ్లీని మెర్వీ ఔట్‌ చేశాడు.

ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ శతకాలతో వీర విహారం చేశారు. శ్రేయస్ అయ్యర్ 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 84 బాల్స్లోనే మూడంకెల స్కోరు అందుకున్నాడు. 94 బాల్స్ ఎదుర్కొన్న ఆయన.. 10 ఫోర్సు, 5 సిక్సర్లతో 128 పరుగులు చేశాడు. ఇక వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ 11 ఫోర్లు, 4 సిక్సులతో నెదర్లాండ్ బౌలర్లను బెంబేలెత్తించాడు. 62 బాల్స్లోనే సెంచరీ పూర్తి చేశాడు. 64 బంతుల్లో 102 పరుగులు చేసిన రాహుల్.. చివరి ఓవర్ ఐదో బంతికి సైబ్రాండ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు ఏకంగా 208 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 2 (1) రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్‌ డీ లీడీ రెండు వికెట్లు తీయగా, వాన్‌ డెర్‌ మెర్వీ, పాల్‌ వాన్‌ మీకిరన్‌ చెరో వికెట్‌ తీశారు.

Updated : 12 Nov 2023 12:46 PM GMT
Tags:    
Next Story
Share it
Top