Home > క్రీడలు > India Vs England : ఫింగర్ సెలబ్రేషన్తో.. బెన్ స్టోక్స్కు శ్రేయస్ అయ్యర్ కౌంటర్

India Vs England : ఫింగర్ సెలబ్రేషన్తో.. బెన్ స్టోక్స్కు శ్రేయస్ అయ్యర్ కౌంటర్

India Vs England : ఫింగర్ సెలబ్రేషన్తో.. బెన్ స్టోక్స్కు శ్రేయస్ అయ్యర్ కౌంటర్
X

ఉప్పల్ ఓటమికి టీమిండియా బదులు తీర్చుకుంది. వైజాగ్ లో గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. సిరీస్ 1-1తో సమం చేసుకుంది. రెండో టెస్టులో 106 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను చిత్తు చేసింది. భారత్ నిర్దేశించిన 399 పరుగుల లక్ష్యాన్ని చేదించలేక ఇంగ్లాండ్ చేతులెత్తేసింది. భారత విజయం ఒకెత్తైతే.. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ పై శ్రేయస్ అయ్యర్ రివేంజ్ మరో ఎత్తు. రెండో ఇన్నింగ్స్ లో స్టోక్స్ ను రనౌట్ చేసిన అయ్యర్.. ఫింగర్ సెలబ్రేషన్ తో అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. అశ్విన్ బౌలింగ్ లో స్టోక్స్ మిడ్ వికెట్ మీదుగా షాట్ ఆడతాడు. ఆ ప్లేస్ లో ఫీల్డింగ్ చేస్తున్న అయ్యర్ మెరుపు వేగంతో బాల్ ను అందుకుని.. వికెట్లకేసి కొడతాడు. ఇంకేముందకు స్టోక్స్ రన్ ఔట్ అయి పెవిలియన్ చేరుతుంటే.. అయ్యర్ ఫింగర్ చూపిస్తూ కౌంటర్ ఇచ్చాడు.





అంతకుముందుకు భారత్ రెండో ఇన్నింగ్స్ లో అయ్యర్ బ్యాటింగ్ చేస్తుండగా.. మిడాఫ్ మీదుగా షాట్ ఆడతాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న స్టోక్స్.. డైవ్ చేసి క్యాచ్ పడతాడు. దీంతో అయ్యర్ కు ఫింగర్ చూపిస్తూ సెలబ్రేట్ చేసుకుంటాడు. దీన్ని ప్రతీకారం తీసుకున్న అయ్యర్.. అదే తరహాలో స్టోక్స్ ను అరెస్ట్ చేసి కౌంటర్ ఇచ్చాడు. అంతకముందు ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రాలి క్యాచ్ ను అయ్యర్ అద్భుతంగా ఆదుకున్నాడు.






Updated : 5 Feb 2024 7:10 PM IST
Tags:    
Next Story
Share it
Top