Home > క్రీడలు > IND vs AUS: నేడు కీలక పోరు.. టీమిండియా గెలిస్తేనే..!

IND vs AUS: నేడు కీలక పోరు.. టీమిండియా గెలిస్తేనే..!

IND vs AUS: నేడు కీలక పోరు.. టీమిండియా గెలిస్తేనే..!
X

టీమిండియా మరో కీలక పోరుకు సిద్ధం అయింది. ఇవాళ ఆస్ట్రేలియాతో జరిగే 4 టీ20లో అమీతుమీ తేల్చుకోనుంది. ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా.. మొదటి రెండు మ్యాచ్ లు భారత్ గెలవగా, ఆసీస్ ఒకటి గెలిచింది. దీంతో ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఈ మ్యాచ్ లో గెలిచి భారత్ సిరీస్ గెలవాలని చూస్తుంటే.. సిరీస్ ను సమం చేయాలని ఆసీస్ చూస్తుంది. బ్యాటింగ్ లో అద్భుతంగా ఉన్న భారత్ ను బౌలింగ్ దళం ఇబ్బంది పెడుతుంది. గత మ్యాచ్ లో దారుణంగా ఫెయిలై గెలిచే మ్యాచ్ ను చేతులారా ఓడగొట్టుకుంది. దీంతో ఈ మ్యాచ్ బౌలర్లకు కఠిన పరీక్షగా మారనుంది. వరుసగా డెత్ ఓవర్లలో ఫెయిల్ అవుతున్న కారణంగా.. ఈ మ్యాచ్ లో డెత్ ఓవర్స్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌ పర్ఫెక్షన్‌‌‌‌ కోసం బౌలర్లను మార్చే చాన్స్‌‌‌‌ ఉంది.

కాగా ఈ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్, ముకేశ్ కుమార్, దీపక్ చాహర్ టీమిండియా జట్టులో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. వీరి ఎంట్రీతో తిలక్ వర్మ, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణలను పక్కనబెట్టే అవకాశం కనిపిస్తుంది. వర్క్‌‌‌‌లోడ్‌‌‌‌లో భాగంగా మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌, స్టోయినిస్‌‌‌‌, ఆడమ్‌‌‌‌ జంపా, స్మిత్‌‌‌‌, ఇంగ్లిస్‌‌‌‌ను తప్పించిన ఆసీస్.. యంగ్‌‌‌‌స్టర్స్‌‌‌‌కు అవకాశం ఇవ్వనుంది. ఇందులో భాగంగానే ఆఫ్ స్పిన్నర్ క్రిస్ గ్రీన్ కు అవకాశం దక్కనుంది. జోస్‌‌‌‌ ఫిలిప్‌‌‌‌, బెన్‌‌‌‌ మెక్‌‌‌‌డెర్మాట్‌‌‌‌, బెన్‌‌‌‌ డ్వారిషస్‌‌‌‌లను కూడా తుది జట్టులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. కాగా సీనియర్లు లేకపోవడం ఆసీస్ కు ఎదురుదెబ్బ అనే చెప్పాలి. కాగా ఇవాళ రాంపూర్ వేదికగా జరిగే మ్యాచ్ రాత్రి 7గంటలకు ప్రారంభం కానుంది. జియో సినిమా, స్పోర్ట్స్18లో వీక్షించవచ్చు.




Updated : 1 Dec 2023 8:18 AM IST
Tags:    
Next Story
Share it
Top