Home > క్రీడలు > గాయం కాలేదు అంతా తూచ్.. టీమిండియాలో శ్రేయస్కు దక్కని చోటు

గాయం కాలేదు అంతా తూచ్.. టీమిండియాలో శ్రేయస్కు దక్కని చోటు

గాయం కాలేదు అంతా తూచ్.. టీమిండియాలో శ్రేయస్కు దక్కని చోటు
X

టీమిండియాలో ప్రస్తుతం గట్టి పోటీ ఉంది. కుర్రాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. అవకాశాలకోసం ఎదురుచూస్తున్నారు. ఈ టైంలో వచ్చిన అవకాశాల్ని వినియోగించుకోవడం ప్రతీఆటగాడికి చాలా ముఖ్యం. ఎంతోకాలంగా రాణిస్తున్న ఆటగాళ్లను కూడా.. రెండు మూడు సార్లు ఫెయిల్ అయితే పక్కనబెట్టేస్తున్నారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ ప్రతీ ఆటగాడికి కీలకం కానుంది. ఇప్పటికే శుభ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ టైంలో రెండో మ్యాచ్ లో రాణించిన గిల్.. ఒత్తిడిలో అద్భుత సెంచరీచేసి అందరినోళ్లు మూయించాడు. గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన శ్రేయస్ అయ్యర్.. ఆసియా కప్ లో రాణించాడు. అయితే టెస్టుల్లో మాత్ర ఆ జోరు చూపలేకపోతున్నాడు. స్పిన్ ను దాటిగా ఎదుర్కొనే అయ్యర్.. స్వదేశంలో తేలిపోవడం జట్టుకు ఇబ్బంది కలిగించే విషయమే.

తాజాగా మిగిలిర మూడు టెస్టులకు బీసీసీఐ జట్టును ప్రకటించింది. రెండో మ్యాచుకు ముందు గాయాల పాలైన కేఎల్ రాహుల్, జడేజా, గిల్ తిరిగి జట్టులోకి వచ్చారు. శ్రేయస్ అయ్యర్ కు కూడా గాయం అయిందనే వార్త ప్రచారంలో ఉంది. అందుకే అతనికి జట్టులో చోటు కల్పించలేదన్నారు. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. రెగ్యులర్ గా ఫెయిల్ అవుతున్న కారణంగా జట్టునుంచి బీసీసీఐ కావాలనే తప్పించినట్లు తెలుస్తుంది. గత రెండు రోజులుగా అయ్యర్‌కు వెన్నునొప్పి తిరగబెట్టిందని, అతను మిగిలిన సిరీస్‌కు అందుబాటులో ఉండడని వార్తలు వస్తున్నా.. బీసీసీఐ మాత్రం ఆ విషయంలో ఎలాంటి స్పష్టతనివ్వలేదు. దీంతో ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. గాయం కాలేదు? ఫామ్ లేదని తప్పించామని బీసీసీఐ ప్రకటించలేదు? మరి అయ్యర్ ను ఎందుకు సెలక్ట్ చేయలేదని బీసీసీఐ క్రీడా వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

అయ్యర్ చివరి ఎనిమిది టెస్ట్ ఇన్నింగ్స్ లో చూసుకుంటే.. 31, 6, 0, 4 నాటౌట్, 35, 12, 27, 29 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో రాబోయే చివరి మూడు టెస్టులకు అతనిపై వేటు పడే అవకాశం ఉంది. సౌతాఫ్రికా టెస్టుల్లోనూ ఇదే తరహాలో ఫెయిల్ అయ్యాడు. దీంతో అయ్యర్ ను తప్పించాలనే డిమాండ్ పెరిగిపోయింది. అతని స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ ను జట్టులోకి తీసుకోవాలని క్రికెట్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. సర్ఫరాజ్ కూడా స్పిన్ లో బాగా ఆడగలడు. చాలాకాలంగా దేశవాళీలో రాణిస్తున్న సర్ఫరాజ్ ను.. జాతీయ జట్టులోకి ఎంపిక చేయడం ఇదే సరైన సమయం. ఇప్పటికే కోహ్లీ స్థానంలో రజత్ పటిదార్ అరంగేట్రం చేసి.. పరవాలేదనిపించాడు. ఈ క్రమంలోనే బీసీసీఐ అయ్యర్ ను సైలెంట్ గా జట్టు నుంచి తప్పించినట్లు తెలుస్తుంది.

Updated : 10 Feb 2024 1:04 PM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top