Home > క్రీడలు > IND vs AUS: టీమిండియాకు బిగ్ షాక్.. వరల్డ్కప్కు శుభ్మన్ గిల్ దూరం

IND vs AUS: టీమిండియాకు బిగ్ షాక్.. వరల్డ్కప్కు శుభ్మన్ గిల్ దూరం

IND vs AUS: టీమిండియాకు బిగ్ షాక్.. వరల్డ్కప్కు శుభ్మన్ గిల్ దూరం
X

మరో రెండు రోజుల్లో టీమిండియా వరల్డ్ కప్ లో మొదటి మ్యాచ్ ఆడనుంది. సొంత గడ్డపై జరుగుతున్న ఈ మెగా టోర్నీలో.. జట్టుపై భారత అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. 2011 వరల్డ్ కప్ సీన్ రిపీట్ చేయాలని ఆశిస్తున్నారు. ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లంతా సూపర్ ఫామ్ లో ఉన్నారు. జట్టులో జూనియర్ శుభ్ మన్ గిల్ కూడా ఓపెనర్ గా జట్టుకు వెన్నుముకగా నిలుస్తున్నాడు. ఇక ఆస్ట్రేలియాతో జరిగే మొదటి మ్యాచ్ లో దుమ్ము రేపుతాడనుకుంటే.. ఓ పెద్ద సమస్య వచ్చి పడింది. తొలి మ్యాచ్ కు ముందు టీమిండియాకు షాక్ తగిలింది. భారత్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ డెంగీ బారిన పడ్డాడు.

ఆదివారం (అక్టోబర్ 8) ఆస్ట్రేలియాతో జరిగే తొలి మ్యాచ్ కు గిల్ అందుబాటులో ఉండడని క్రికెట్ వర్గాలు చెప్తున్నాయి. గిల్ లేకపోవడం భారత్ కు పెద్ద దెబ్బ అనే చెప్పాలి. వరల్డ్ కప్ కు ముందు భారత్ ఆడిన ఆసియా కప్, ఆస్ట్రేలియా వన్డే సిరీస్ లో గిల్ అద్భుతంగా రాణించాడు. టోర్నీలో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన భారత్ కు ఇది చేదు వార్త. తొలి మ్యాచ్ కు గిల్ అందుబాటులో లేకపోవడం టీమిండియాకు కాస్త ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. అయితే గిల్ జట్టుకు దూరం అయితే.. ఆస్ట్రేలియాతో జరిగే తొలి మ్యాచ్ లో ఓపెనర్ గా రోహిత్ శర్మకు జోడీగా ఇషాన్ కిషన్ వస్తాడు.

Updated : 6 Oct 2023 12:28 PM IST
Tags:    
Next Story
Share it
Top