Shubman Gill : హోరాహోరీగా వైజాగ్ టెస్ట్.. పట్టు బిగిస్తున్న భారత్
X
(Shubman Gill) టీమిండియా రెండో రోజు ఆటను ఆధిక్యంలో ముగించింది. ఇన్నింగ్స్ ను కొనసాగించిన భారత్ కు మూడో రోజు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. మొదటి సెషన్ ప్రారంభంలోనే జేమ్స్ అండర్సన్ రోహిత్ శర్మ (13), యశస్వీ జైస్వాల్ (17)లను పెవిలియన్ చేర్చాడు. దీంతో ఆట రసవత్తరంగా మారింది. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ (29), రజత్ పటీదార్ (9) వెంట వెంటనే ఔట్ అయ్యారు. దీంతో భారత్ పై ఒత్తిడి మొదలైంది. భారీ ఆధిక్యం చేసే అవకాశం చేజారిపోయేలా కనిపించింది. ఈ క్రమంలో పుంజుకున్న గిల్ (87 నాటౌట్) సమయోచిత ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఇంగ్లాండ్ కు చిక్కకుండా ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్తున్నాడు.
దీంతో తనపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పినట్లైంది. ప్రస్తుతం క్రీజులో అక్షర్ పటేల్ (23), గిల్ ఉన్నారు. కాగా భారత్ 321 పరుగుల ఆధిక్యంతో మూడో రోజు ఆటను కొనసాగిస్తుంది. ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్ 2 వికెట్లు తీసుకున్నాడు. రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లే చెరో వికెట్ పడగొట్టారు.