IND vs BAN: భారత్ను కాపాడుతున్న శుభ్మన్ గిల్.. సెంచరీతో చెలరేగి..
X
సూపర్ 4లో భాగంగా కొలంబో వేదికపై బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. బంగ్లా బౌలర్ల దాటికి ఒక్కో బ్యాట్స్ మెన్ పెవిలియన్ కు క్యూ కడుతున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ (0) డక్ ఔట్ అయి వెనుదిరగగా.. అతని వెంట మిగతా వాళ్లంతా క్యూ కట్టారు. తిలక్ వర్మ (5), రాహుల్ (19), ఇషాన్ (5), సూర్య కుమార్ (26), జడేజా (7) తీవ్రంగా నిరాశ పరిచారు. ఓపెనర్ గా వచ్చిన శుభ్ మన్ గిల్ (112, 125 బంతుల్లో, నాటౌట్) అద్భుత సెంచరీతో ఇన్నింగ్స్ ను కొనసాగిస్తున్నాడు. కష్టాల్లో టీమిండియాను ముందుకు తీసుకెళ్తున్నాడు. కీలక సమయంలో అద్భుత బ్యాటింగ్ చేసిన గిల్ ను చూస్తుంటే అచ్చం విరాట్ కోహ్లీలా అనిపిస్తుందని అంటున్నారు. విరాట్ కోహ్లీ కష్టాల్లో టీంకు వెన్నెముకలా నిలబడతాడు. అలానే గిల్ కూడా తోటి బ్యాట్స్ మెన్ పెవిలియన్ చేరుతున్నా ఒంటరి పోరాటం చేస్తున్నాడు. గిల్ కు ప్రస్తుతం అక్షర్ (8) తోడుగా ఉన్నాడు. అద్భుత బ్యాటింగ్ చేసిన బంగ్లా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది.
The PRINCE Celebration 🥵👑#INDvBAN #gill pic.twitter.com/6r8eXfLejA
— Md Nayab 🇮🇳 (@MdNayab175862) September 15, 2023