Home > క్రీడలు > Shubman Gill : అద్భుత సెంచరీతో అందరి నోళ్లు మూయించిన శుభ్మన్ గిల్

Shubman Gill : అద్భుత సెంచరీతో అందరి నోళ్లు మూయించిన శుభ్మన్ గిల్

Shubman Gill : అద్భుత సెంచరీతో అందరి నోళ్లు మూయించిన శుభ్మన్ గిల్
X

రెండో టెస్టులో శుభ్ మన్ గిల్ అద్భుత సెంచరీ చేశాడు. తనపై వస్తున్న విమర్శలకు బ్యాటుతోనే సమాధానం చెప్పాడు. తన సత్తా అయిపోలేదని నిరూపించాడు. జట్టు ఒత్తిడిలో ఉన్న సమయంలో కీలక ఇన్నింగ్స్ ఆడి వెన్నెముకలా నిలబడ్డాడు. రెండో రోజు ఆటను ఆధిక్యంలో ముగించిన టీమిండియా.. మూడో రోజు ఆటను కొనసాగించింది. కాగా మూడో రోజు ప్రారంభంలోనే భారత్ కు ఎదురుదెబ్బ తగిలింది. మొదటి సెషన్ ప్రారంభంలోనే జేమ్స్ అండర్సన్ రోహిత్ శర్మ (13), యశస్వీ జైస్వాల్ (17)లను పెవిలియన్ చేర్చాడు. దీంతో ఆట రసవత్తరంగా మారింది. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ (29), రజత్ పటీదార్ (9) వెంట వెంటనే ఔట్ అయ్యారు.

దీంతో భారత్ పై ఒత్తిడి మొదలైంది. భారీ ఆధిక్యం చేసే అవకాశం చేజారిపోయేలా కనిపించింది. ఈ క్రమంలో పుంజుకున్న గిల్ (104, 147 బంతుల్లో) సమయోచిత ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లాండ్ కు చిక్కకుండా ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. దీంతో తనపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పినట్లైంది. ప్రస్తుతం క్రీజులో అక్షర్ పటేల్ (39), కేఎస్ భరత్ (1) ఉన్నారు. కాగా భారత్ 360 పరుగుల ఆధిక్యంతో మూడో రోజు ఆటను కొనసాగిస్తుంది. ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్ 2 వికెట్లు తీసుకున్నాడు. రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లే, రెహాన్ అహ్మద్ చెరో వికెట్ పడగొట్టారు.

Updated : 4 Feb 2024 9:02 AM GMT
Tags:    
Next Story
Share it
Top