ICC Worldcup 2023: ‘మీరన్న మాటలు కోహ్లీకి తెలిసాయా.. ఇక అంతే’: శ్రీశాంత్
X
శ్రీశాంత్.. 2007, 2011 వరల్డ్ కప్ హీరో. తన పేస్ బౌలింగ్, అగ్రెషన్ తో ప్రత్యర్థులను భయపెట్టేవాడు. స్లెడ్జింగ్ కు గట్టి సమాధానం ఇచ్చేవాడు. అలాంటివాని ముందు టీమిండియాను తక్కువ చేసి మాట్లాడితే ఊరుకుంటాడా. గట్టిగా ఇచ్చిపడేస్తాడు. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ భారత క్రికెట్ ను విమర్శించాడు. మెగా టోర్నీల్లో భారత్ భయపడుతుందని, అందుకే దూకుడుగా ఆడలేదని తక్కువ చేసి మాట్లాడాడు. దీనికి శ్రీశాంత్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఇలాంటి మాటలు మీరు కోహ్లీ ముందు మాట్లాడకండి. పరిణామం వేరేలా ఉంటుందంటూ బదులిచ్చాడు. అంతేకాకుండా..
‘ఇతరుల గురించి మాట్లాడే ముందు మీ గురించి మీరు తెలుసుకోండి. మీరు ఎన్ని గెలిచారు అందరికీ తెలుసు. ఈసారి న్యూజిలాండ్ భారత గడ్డపై ఆడుతుంది. భారత ఆటగాళ్లు దూకుడుగా ఆడతారా? లేదా? అనేది వాళ్లను అడిగి తెలుసుకోండి. 2019లో ఫైనల్ చేరారు. సెమీస్ లో ధోనీ పొరపాటున రనౌట్ కాకపోయి ఉంటే మీ పరిస్థితి ఏంటి? ఈసారి కివీస్ పై భారత్ ప్రతీకారం తీర్చుకోవడం కాయం. మీరు గుణపాఠం నేర్చుకునే టైం దగ్గర పడింది. ఇంకా ఏమైనా అనాలి అనుకునే ముందు మా జట్టులో విరాట్ కోహ్లీ ఉన్నాడని గుర్తుంచుకోండి. మీరన్న మాటలు అతని దృష్టికి వెళ్తే.. అది మీ ఊహకే వదిలేస్తున్నా’ అని గట్టి బదులిచ్చాడు శ్రీశాంత్. వరల్డ్ కప్ లో భాగంగా అక్టోబర్ 22న భారత్- న్యూజిలాండ్ తలపడతాయి. ఈ మ్యాచ్ కూడా రసవత్తరం కానుంది.