Home > క్రీడలు > IND vs SL: ఫైనల్ మ్యాచ్లో మ్యాచ్ ఫిక్సింగ్.. భారీ బేరానికి లంక ఆటగాళ్లు

IND vs SL: ఫైనల్ మ్యాచ్లో మ్యాచ్ ఫిక్సింగ్.. భారీ బేరానికి లంక ఆటగాళ్లు

IND vs SL: ఫైనల్ మ్యాచ్లో మ్యాచ్ ఫిక్సింగ్.. భారీ బేరానికి లంక ఆటగాళ్లు
X

ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ మొదలయింది. కొలంబో వేదికపై భారత్, శ్రీలంక అమీ తుమీ తల పడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక బొక్క బోర్లా పడింది. 6 ఓవర్లలో 12 పరుగులు మాత్రమే చేసి 5 వికెట్లు కోల్పోయింది. మహమ్మద్ సిరాజ్ 5 వికెట్లతో రెచ్చిపోయాడు. బుమ్రా ఒక వికెట్ పడగొట్టాడు. దీంతో లంక పీకల్లోతు కష్టాల్లో పడింది. ముగ్గురు కీలక బౌలర్లు డకౌట్ గా పెవిలియన్ చేరారు. ఒకరు 2 పరుగులు చేయగా, మరొకరు 4 కొట్టి ఔట్ అయ్యారు. ఈ క్రమంలో మ్యాచ్ ఫిక్సింగ్ అయిందని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.

బీసీసీఐ.. శ్రీలంక బోర్డ్ తో భారీ డీల్ కుదుర్చుకుందని అంటున్నారు. టీమిండియా ఐసీసీ ట్రోఫీ గెలుచుకోక 9 ఏళ్లు అవుతుంది. చివరిసారిగా ఆసియా కప్ 2018లో గెలిచింది. ప్రతీ టోర్నీలో సెమీస్, ఫైనల్ కు చేరుతున్నా కప్పు గెలవలేక పోతుంది. ఈ క్రమంలో... ఈసారి ఆసియా కప్ ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తుంది. గత సిరీస్ లు, ఆసియా కప్ లో అద్భుత ప్రదర్శన చేసిన శ్రీలంక.. ఇలా ఫైనల్ మ్యాచ్ లో అదీ సొంత స్టేడియంలో బొక్కబోర్లా పడటం ఏంటని అంటున్నారు. బీసీసీఐ భారీ బేరం కుదుర్చుకుని లంక బోర్డ్ తో ఫిక్సింగ్ కు పాల్పడిందని ఆరోపిస్తున్నారు.




Updated : 17 Sept 2023 5:10 PM IST
Tags:    
Next Story
Share it
Top