IND vs PAK: బ్యాక్ టు బ్యాక్ వికెట్లు.. కష్టాల్లో పాకిస్తాన్
X
భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్.. నువ్వా నేనా అన్నట్లు సాగుతుంది. టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుంటే.. పాక్ బ్యాటర్లు ఆచితూచి బౌడరీలు బాదుతున్నారు. ఈ క్రమంలో పాక్ 330 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. పాక్ ఓపెనర్లు అబ్దుల్ షఫిక్ (20, 24 బంతుల్లో), ఇమామ్ ఉల్ హక్ (36, 38 బంతుల్లో) మంచి ఆరంభం అందించినా.. పార్ట్ నర్షిప్ ను కొనసాగించలేకపోయారు. తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ బాబర్ ఆజం (50, 58 బంతుల్లో), రిజ్వాన్ (47, 63 బంతుల్లో, నాటౌట్) మూడో వికెట్ కు 82 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాగా బాబర్ కు ఈ వరల్డ్ కప్ లో మొదటి హాఫ్ సెంచరీ.
ఓపెనర్లు మంచి భాగస్వామ్యం నెలకొల్పుతారు అనుకున్న క్రమంలో.. సిరాజ్, అబ్దుల్ ను ఎల్బీడబ్ల్యూ చేశాడు. వరుస బౌండరీలు బాదుతూ జోరుమీదున్న ఇమామ్ ను హార్దిక్ ఔట్ సైడ్ హాఫ్ స్టంప్ బాల్ తో పెవిలియన్ కు పంపించాడు. ఈ క్రమంలో హార్దిక్ బౌలింగ్ చేసిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అప్పటికే చెలరేగుతున్న ఇమామ్.. హార్దిక్ బౌలింగ్ లో వరుసగా రెండు బౌండరీలు కొట్టాడు. దీంతో తనని తానే తిట్టుకున్న హార్దిక్.. బాల్ తో ఏదో మాట్లాడి, బౌలింగ్ చేస్తాడు. ఆ బంతికే ఇమామ్ కీపర్ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. తర్వాత బాబర్, రిజ్వాన్ తో కలిసి భారీ స్కోర్ దిశగా భాగస్వామ్యాన్ని తీసుకెళ్తున్న టైంలో.. బాబర్ ను బౌట్ చేసిన సిరాజ్, పాకిస్తాన్ కు బ్రేక్ ఇచ్చాడు.
33వ ఓవర్లో కుల్దీప్ వరుస వికెట్లతో పాక్ ను కష్టాల్లో నెట్టాడు. బాబర్ తర్వాత వచ్చిన సౌద్ షకీల్ (6, 10 బంతుల్లో), ఇఫ్తికర్ అహ్మద్ (4, 3 బంతుల్లో) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. కుల్దీప్ వేసిన 33 ఓవర్లో షకీల్ ఎల్బీడబ్ల్యూ కాగా, ఇఫ్తికర్ బౌల్డ్ అయ్యారు. కాగా ఇప్పటి వరకు జరిగిన ఇన్నింగ్స్ లో పాక్ బ్యాటర్లకు చాలా లైఫ్ లు వచ్చాయి. 24.3 బంతికి బాబర్ బతికిపోయాడు. కుల్దీప్ వేసిన బంతికి ఎల్బీడబ్ల్యూ కాగా.. థర్డ్ అంపైర్ దాన్ని అంపైర్స్ కాల్ గా ప్రకటించాడు. అదేకాకుండా ఇమామ్, అబ్దుల్, రిజ్వాన్ లకు కూడా తప్పించుకున్నారు. రన్ ఔట్, క్యాచ్ మిస్ ల రూపంలో వాళ్లకు లైఫ్ వచ్చింది.
Siraj gets Babar Azam & breaks the Partnership.#INDvsPAK pic.twitter.com/cOsvOjenCO
— Cricpedia Edits (@Cricpedia_edits) October 14, 2023