Siraj: వరల్డ్కప్కు ముందు గుడ్ న్యూస్.. ఆస్ట్రేలియా బౌలర్ను వెనక్కినెట్టిన సిరాజ్..
X
మహమ్మద్ సిరాజ్ వన్డేల్లో మరోసారి అత్యుత్తమ ర్యాంకును సాధించాడు. ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హాజిల్ వుడ్ ను వెనక్కినెట్టి.. నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆసియా కప్ ఫైనల్ లో కెరీర్ అత్యుత్తమ ప్రదర్శన చేసిన సిరాజ్.. ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి ప్రపంచ నెంబర్ వన్ బౌలర్ గా అవతరించాడు. 694 పాయింట్లతో అగ్రపీఠాన్ని కైవసం చేసుకున్నాడు. కాగా ఆసియా కప్ ఫైనల్ లో శ్రీలంకను ముప్పుతిప్పలు పెట్టిన సిరాజ్.. ఒకే ఓవర్లో 4 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ లో మొత్తం 6 వికెట్లు దక్కించుకున్నాడు. దీంతో లంకను 50 పరుగులకు ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఆసియా కప్ టోర్నీలో 12.2 సగటుతో మొత్తం 10 వికెట్లు పడగొట్టాడు. ఈ ఉత్తమ ప్రదర్శనతో టీమిండియా శిబిరంలో కొత్త ఉత్సాహం నెలకొంది. మరి కొద్ది రోజుల్లో వరల్డ్ కప్ ప్రారంభమయ్యే నేపథ్యంలో సిరాజ్ కీలక ప్రదర్శన జట్టులో అత్మవిశ్వాసాన్ని నింపింది. 2019 జనవరి 15న వన్డే డెబ్యూట్ చేసిన సిరాజ్.. 29 మ్యాచుల్లో 53 వికెట్లు పడగొట్టాడు.