Home > క్రీడలు > సిరాజ్ సూపర్ మ్యాన్ క్యాచ్.. సింగిల్ హ్యాండ్తో కళ్లు చెదిరేలా..

సిరాజ్ సూపర్ మ్యాన్ క్యాచ్.. సింగిల్ హ్యాండ్తో కళ్లు చెదిరేలా..

సిరాజ్ సూపర్ మ్యాన్ క్యాచ్.. సింగిల్ హ్యాండ్తో కళ్లు చెదిరేలా..
X

వెస్టిండీస్ గడ్డపై జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్.. 150 పరుగులకే విండీస్ ను ఆలౌట్ చేసింది. స్పిన్ ఉచ్చు బిగించి విండీస్ ను ఉక్కిరబిక్కిరి చేసింది. అశ్విన్ 5 వికెట్లు, జడేజా 3 వికెట్లు తీసి విండీస్ ను కుప్ప కూల్చారు. ప్రస్తుతం కెప్టెన్ రోహిత్ శర్మ (30), యంగ్ స్టర్ యశస్వీ జైశ్వాల్ (40) క్రీజ్ లో ఉన్నారు. ఈ మ్యాచ్ లో మహమ్మద్ సిరాజ్ ఒక వికెటే తీసినా.. తన సూపర్ ఫీల్డింగ్ తో అందరి ప్రశంసలు అందుకున్నాడు.

వెస్టిండీస్ ఇన్నింగ్స్ 28 ఓవర్ చివరి బంతిని రవీంద్ర జడేజా వేయగా.. బ్లాక్ వుడ్ భారీ షాట్ కు ప్రయత్నించాడు. లాంగ్ మిడాఫ్ లో గాల్లో లేచిన బంతిని సిరాజ్ వెనక్కి పరిగెత్తి డైవ్ చేసి అద్భుత క్యాచ్ పట్టాడు. ఈ క్రమంలో నేలకు బలంగా గుద్దుకోగా మోచేతికి గాయం అయింది. అయినా కొంతసేపటికి సర్దుకుని.. తిరిగి బౌలింగ్ చేశాడు.


Updated : 13 July 2023 4:01 PM IST
Tags:    
Next Story
Share it
Top