Home > క్రీడలు > Siraj : సిరాజ్ ‘మియా’ బీభత్సం.. సఫారీలను చుక్కలు చూపించిన హైదరాబాదీ

Siraj : సిరాజ్ ‘మియా’ బీభత్సం.. సఫారీలను చుక్కలు చూపించిన హైదరాబాదీ

Siraj : సిరాజ్ ‘మియా’ బీభత్సం..   సఫారీలను చుక్కలు చూపించిన హైదరాబాదీ
X

ఒకే రోజు ఆట.. ఈ ఆటలో ఎన్ని మలుపులు... ఎన్ని అనూహ్యా పరిణామాలు. టెస్ట్ మ్యాచ్ అంటే బోరింగ్ అనే స్థాయి నుండి టెస్ట్ మ్యాచ్ కూడా ఇంత ఆసక్తికరంగా ఉంటుందా? అని అనిపించేలా ఫ్రాన్స్‌ను మంచి ఎంటర్‌ టైన్‌ చేసింది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆట ఆసక్తికర మలుపులు తిరుగుతూ మంచి మజాను పంచింది. ఇక ఈ ఆటలో మనం ఒక్క స్పెషల్ బాయ్ గురించి మాట్లాడుకోవాలి. అతనే మన హైదరాబాద్ కుర్రాడు సిరాజ్ మియా.. టాస్‌ ఓడగానే వెనుకబడిపోయినట్లు అనిపించిన భారత్‌‌కు మొహమ్మద్‌ సిరాజ్‌ అద్భుత బౌలింగ్‌‌తో జట్టుకు మంచి ఉత్సాహాన్ని అందించాడు.

పేస్‌ బౌలర్లకు పిచ్‌ అద్భుతంగా అనుకూలించడంతో భారత బౌలర్లు విజృంభించి దక్షిణాఫ్రికాను తొలి ఇన్నింగ్స్‌లో 23.2 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూల్చారు. మొహమ్మద్‌ సిరాజ్‌ (6/15) తన అద్భుతమైన బౌలింగ్‌‌తో సఫారీలకు చెమటలు పట్టించాడు. సిరాజ్‌ తన రెండో ఓవర్‌ రెండో బంతికి మార్క్‌రమ్‌ (0)ను అవుట్‌ చేసి సఫారీల పతనాన్ని శాసించాడు. మెుదటి మ్యాచ్‌ స్టార్ బ్యాట్స్‌మెన్ ఎల్గర్‌ (2)ను కూడా సిరాజ్‌ బౌల్డ్‌ చేశాడు. స్టబ్స్‌ (3)ను బుమ్రా వెనక్కి పంపగా.. జోర్జి (2) బెడింగామ్‌ (12), జాన్సెన్‌ (0)ల పని పట్టి ఐదు వికెట్లతో తొలి ఇన్నింగ్స్ స్టార్‌‌గా నిలిచాడు. ఆ తర్వాతి చివరి 4 వికెట్లను భారత్‌ బౌలర్లు సులభంగా పడగొట్టి 55 పరుగులకే సఫారీ జట్టును పరిమితం చేశారు.

అనంతరం బ్యాటింగ్ దిగిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 34.5 ఓవర్లలో 153 పరుగుల స్వల్ప స్కోరుకే ఆలౌటైంది. కోహ్లి (46), రోహిత్‌ (39), శుబ్‌మన్‌ గిల్‌ (36) మినహా మిగతా ఆటగాళ్లు 0కే పరిమితమయ్యారు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన దక్షిణాఫ్రికా 3 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు ఫాలో-ఆన్‌‌లో 36 పరుగులు వెనుకబడి ఉంది.

Updated : 4 Jan 2024 11:37 AM IST
Tags:    
Next Story
Share it
Top