Home > క్రీడలు > SA vs IND: రసవత్తరంగా రెండో టెస్ట్.. ఒకే రోజు 23 వికెట్లు

SA vs IND: రసవత్తరంగా రెండో టెస్ట్.. ఒకే రోజు 23 వికెట్లు

SA vs IND: రసవత్తరంగా రెండో టెస్ట్.. ఒకే రోజు 23 వికెట్లు
X

సౌతాఫ్రికా- భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ నువ్వా నేనా అన్నట్లు రసవత్తరంగా సాగుతుంది. పేస్ బౌలింగ్ కు అనుకూలించే కేప్ టౌన్ పిచ్ పై ఇరు జట్ల బౌలర్లు నిప్పులు చెరిగారు. దీంతో తొలిరోజు 23 వికెట్లు పడ్డాయి. తొలి ఇన్నింగ్స్ లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 55 పరుగులకే ఆలౌట్ కాగా.. తర్వాత టీమిండియాను ప్రొటీస్ జట్టు 154 పరుగులకే కట్టడి చేసింది. భారత్ కు 98 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం చివరి సెషన్ లో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌతాఫ్రికా.. మొదటి 10 ఓవర్లు నిలకడగానే ఆడింది.

అయితే భారత బౌలర్లు విజృంభించడంతో వరుసగా 3 వికెట్లు కోల్పోయింది. కెరీర్ లో చివరి టెస్ట్ ఆడుతున్న డీన్ ఎల్గర్ (12) స్లిప్ లో ఉన్న కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ముకేశ్ కుమార్ వరుస ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా 1 వికెట్ తీసుకున్నాడు. కాగా తొలిరోజు ఆట ముగిసేసరికి సౌతాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో బెండిగ్ హమ్ (7 నాటౌట్), మార్ క్రమ్ (36 నాటౌట్) ఉన్నారు.

Updated : 3 Jan 2024 4:31 PM GMT
Tags:    
Next Story
Share it
Top