SA vs BAN : చెలరేగిన డికాక్.. క్లాసెన్ మెరుపు ఇన్నింగ్స్.. సౌతాఫ్రికా భారీ స్కోర్
X
వరల్డ్ కప్ లో భాగంగా ముంబై వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు చెలరేగారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసింది. సాతాఫ్రికా బ్యాటర్లలో ఓపెనర్ క్వింటన్ డికాక్ అద్భుతమైన శతకంతో చెలరేగగా.. క్లాసెన్, మిల్లర్ మెరుపులు బంగ్లాదేశ్ ముందు 383 పరుగుల లక్ష్యం ఉంచాయి.
సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ సూపర్ ఫామ్‌ని కొనసాగించాడు. ప్రపంచ కప్‌లో వరుసగా రెండు సెంచరీలు బాదిన అతడు.. బంగ్లాపై మ్యాచ్ లో మరో శతకం చేశాడు. డికాక్ 140 బంతుల్లో 15 ఫోర్లు, 7 సిక్స్‌లతో 174 రన్స్ చేశాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ 49 బాల్స్లో 2 ఫోర్లు, 8 సిక్స్‌లతో 90 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. డేవిడ్ మిల్లర్ 15 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లతో 34* రన్స్ చేశాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహమూద్ 2, షోరిఫుల్, హసన్ మిరాజ్, షకీబ్ అల్ హసన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.