South Africa vs India, 1st Test : టీమిండియాకు షాక్.. నిరాశ పరిచిన కెప్టెన్ రోహిత్ శర్మ
X
సెంచూరియన్ వేదికగా.. భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. గత మూడు దశాబ్దాలుగా సఫారీ గడ్డపై టెస్ట్ సీరీస్ నెగ్గని టీమిండియా.. ఈసారి రోహిత్ కెప్టెన్సీలో గెలవాలని పట్టుదలతో సిరీస్ లోకి అడుగుపెట్టింది. మొదట బ్యాటింగ్ చేస్తున్న టీమిండియాకు ఆదిలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ (5, 14 బంతుల్లో), యశస్వీ జైశ్వాల్ (17, 37 బంతుల్లో) ఫెయిల్ అయ్యారు. ఘనంగా ఆరంభిస్తారనుకున్న సిరీస్.. మొదట్లోనే ఔట్ అయి నిరాశ పరిచారు. దీంతో టీమిండియా 23 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. నాంద్రే బర్గర్, కగిసో రబాడా.. చెరో వికెట్ పడగొట్టారు. రోహిత్ శర్మ.. ఓవర్ సీస్ లో ఆడలేడు, సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా నిలబడలేదు అనే మాటలు నిజం అవుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
తుది జట్లు:
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): డీన్ ఎల్గర్, ఐడెన్ మార్క్‌రామ్, టోనీ డి జోర్జి, టెంబా బావుమా(c), కీగన్ పీటర్సన్, డేవిడ్ బెడింగ్‌హామ్, కైల్ వెర్రెయిన్నే(w), మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కగిసో రబడ, నాండ్రే బర్గర్
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(c), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(w), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
Selfless captain Rohit Sharma 🔥#INDvsSApic.twitter.com/o9LljU7vWQ
— Shivam 🚩 (@shivam_pal_18) December 26, 2023