Home > క్రీడలు > వర్షం కారణంగా మ్యాచ్ రద్దు.. సీరియస్ అయిన గవాస్కర్

వర్షం కారణంగా మ్యాచ్ రద్దు.. సీరియస్ అయిన గవాస్కర్

వర్షం కారణంగా మ్యాచ్ రద్దు.. సీరియస్ అయిన గవాస్కర్
X

డర్బన్ వేదికగా సౌతాఫ్రికా- భారత్ మధ్య జరగాల్సిన నిన్నటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే మ్యాచ్ ను రద్దు చేశారు. ఉదయం నుంచి డర్బన్ లో వర్షం కురిసింది. మ్యాచ్ సమయానికి తగ్గుముఖం పడుతుందని అనుకున్నా.. అది జరగలేదు. కాస్త తగ్గుముఖం పడుతుంది అనుకున్నా.. తిరిగి ఎక్కువవడంతో అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో మొదటి మ్యాచ్ ఒక్క బంతి పడకుండానే రద్దైంది. ఈ సిరీస్ కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లకు బీసీసీఐ రెస్ట్ ఇచ్చింది. టీ20లకు తాత్కాలిక కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యా.. గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. దీంతో ఈ సిరీస్ లో టీమిండియాను సూర్యకుమార్ యాదవ్ నడిపిస్తున్నాడు.

కాగా నిన్నటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో.. సౌతాఫ్రికాపై మాజీ టీమిండియా ఆటగాడు సునీల్ గవాస్కర్ ఫైర్ అయ్యాడు. ఉదయం నుంది వర్షం ఆగకుండా కురుస్తున్నా.. మొత్తం మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచకపోవడంతో సౌతాఫ్రికా బోర్డుపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని క్రికెట్ బోర్డుల దగ్గర పుష్కలంగా డబ్బుందని అన్నారు. మైదానాన్ని ఫుల్ గా కవర్ చేయడానికి కవర్లను కొనుగోలుకు అవసరమైన డబ్బు ఉంటుందని.. ఈ విషయంలో నిర్లక్ష్యం వద్దని చెప్పారు. గ్రౌండ్ ను కాపాడుకోవడం తెలియదా?అని మండిపడ్డారు.

Updated : 11 Dec 2023 2:00 AM GMT
Tags:    
Next Story
Share it
Top