Home > క్రీడలు > సత్తాచాటిన సౌతాఫ్రికా.. ఉత్కంఠ పోరులో విజయం..

సత్తాచాటిన సౌతాఫ్రికా.. ఉత్కంఠ పోరులో విజయం..

సత్తాచాటిన సౌతాఫ్రికా.. ఉత్కంఠ పోరులో విజయం..
X

వరల్డ్ కప్లో భాగంగా పాకిస్తాన్ - సౌతాఫ్రికా మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో సౌతాఫ్రికా గెలిచింది. 271పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు ఒక్క వికెట్ తేడాతో గెలిచారు. ఈ మ్యాచ్ క్రికెట్ లవర్స్కు అసలైన మజానిచ్చింది. తప్పక గెలవాల్సిన మ్యాచులో పాక్ బౌలర్లు చెమటోడ్చినా ఫలితం దక్కలేదు. దీంతో ఆ టీం సెమీస్ ఆశలు సంక్లిష్టంగా మారాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 270 రన్స్కే ఆలౌట్ అయ్యింది. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్, సౌద్ షకీల్ హాఫ్ సెంచరీలతో రాణించారు. షాదాబ్ ఖాన్ 43, రిజ్వాన్ 31 రన్స్ తో పర్వాలేదనిపించారు. మిగితా బ్యాట్స్ మెన్స్ అందరూ తక్కువ స్కోర్లకే ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో షమ్సీ 4 మార్కో జాన్సెన్ 3, గెరాల్డ్ కోయెట్జీ 2 వికెట్లు పడగొట్టారు.

ఇక 271 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఫస్ట్ నుంచే ఆచితూచి ఆడారు. మార్‌క్రమ్‌ 94 రన్స్ తో జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఓ వైపు వికెట్లు పడుతున్నా అతడు మాత్రం జాగ్రత్తగా ఆడాడు. అయితే సౌతాఫ్రికా 260 పరుగులకే 9 వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. గెలుపు రెండు టీంలను ఊరించినా.. చివరకు సౌతాఫ్రికానే వరించింది. చివర్లో కేశవ్ మహారాజ్, తబ్రైజ్ షమ్సీ నాటౌట్ గా నిలిచి తమ జట్టుకు విజయాన్ని అందించారు. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది 3, హరీస్ రౌఫ్, మహ్మద్ వసీం,ఉసామా మీర్ తలో 2వికెట్లు పడగొట్టారు.


Updated : 27 Oct 2023 5:30 PM GMT
Tags:    
Next Story
Share it
Top