Home > క్రీడలు > Aus vs SA: దుమ్మురేపిన సౌతాఫ్రికా.. ఆస్ట్రేలియా ఘోర ఓటమి..

Aus vs SA: దుమ్మురేపిన సౌతాఫ్రికా.. ఆస్ట్రేలియా ఘోర ఓటమి..

Aus vs SA: దుమ్మురేపిన సౌతాఫ్రికా.. ఆస్ట్రేలియా ఘోర ఓటమి..
X

శ్రీలంకపై భారీ విక్టరీతో వరల్డ్ కప్ను మొదలుపెట్టిన సౌతాఫ్రికా.. అదే జోరును కొనసాగించింది. రెండో మ్యాచులోనూ ఆసీస్ను ఓడించి టోర్నీలో రెండో విజయాన్ని అందుకుంది. దీంతో వరల్డ్ కప్లో ఆస్ట్రేలియాకు రెండో ఓటమి నమోదైంది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 311 పరుగుల భారీ స్కోర్ చేసింది. పెనర్ క్వింటర్ డికాక్ (109, 106 బంతుల్లో) వరల్డ్ కప్ లో వరుసగా రెండో సెంచరీ చేశాడు. మిడిల్ ఆర్డర్లో వచ్చిన మార్క్రమ్ (56, 44 బంతుల్లో) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. మిగతా సౌతాఫ్రికా బ్యాటర్లు వాన్ డర్ డస్సెన్ (26), క్లసెన్ (29), మార్కో జాన్సన్ (26), మిల్లర్ (17) పరుగులు జోడించడంతో సౌతాఫ్రికా భారీ స్కోర్ చేసింది. స్టార్క్, మ్యాక్స్ వెల్ రెండు వికెట్లు తీసుకోగా.. హాజెల్ వుడ్, కమ్మిన్స్, జాంపా చెరో వికెట్ పడగొట్టారు.

ఈ మ్యాచులో 312 టార్గెట్తో బరిలోకి దిగిన ఆసీస్ ఘోర ఓటమిని చవిచూసింది. దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి 40.5 ఓవర్లలో 177 రన్స్కే ఆసీస్‌ కుప్పకూలింది. ఆసీస్ బ్యాటర్లలో మార్నస్‌ లబుషేన్ (46) టాప్‌ స్కోరర్‌ కావడం గమాన్హం. కమిన్స్, స్టార్క్ మినహా మిగితా బ్యాటర్లు 20రన్స్కు మించి చేయలేదు. 27 రన్స్ కే ఓపెనర్స్ ఇద్దరూ ఔటవ్వగా.. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. సౌతాఫ్రికా రబడ 3 వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, తబ్రైజ్ షమ్సీ తలో 2వికెట్లు పడగొట్టారు.

Updated : 12 Oct 2023 10:18 PM IST
Tags:    
Next Story
Share it
Top