అదరగొట్టిన సౌతాఫ్రికా.. న్యూజిలాండ్ ఘోర ఓటమి..
X
ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికా జూలు విదిల్చింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్లో అదరగొట్టి కివీస్ను చిత్తు చేసింది. పూణేలో జరిగిన ఈ మ్యాచ్లో 190 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. 35.3 ఓవర్లలో 167 రన్స్కే న్యూజిలాండ్ కుప్పకూలింది. కివీస్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్ 60 రన్స్తో రాణించగా.. విల్ యంగ్ 33, డారిల్ మిచెల్ 24 పరుగులు చేశారు. మిగితా బ్యాట్స్మెన్స్ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్ 4, మార్కో జాన్సెన్ 3 వికెట్లు, గెరాల్డ్ కోయెట్జీ 2 వికెట్లు పడగొట్టగా రబడ ఒక వికెట్ తీశారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు సెంచరీలతో కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. క్వింటన్ డికాక్ 114, వాండర్ డసెన్ 133 శతకాలు చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. మిల్లర్ కూడా హాఫ్ సెంచరీ 53తో రాణించాడు. వరల్డ్ కప్లో భాగంగా ఇప్పటివరకు ఏడు మ్యాచులు ఆడిన సౌతాఫ్రికా 6 మ్యాచుల్లో గెలిచి పాయింట్స్ టేబుల్లో నెంబర్ వన్ స్థానంలో ఉంది.