South Africa vs India : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా
X
భారత్ - సౌతాఫ్రికా మధ్య తొలి వన్డే జరగుతోంది. జోహన్నెస్‌బర్గ్ స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బౌలింగ్ చేయనుంది. ఇప్పటికే సౌతాఫ్రికాపై టీ20 సిరీస్ గెలిచిన టీమిండియా వన్డే సిరీస్ను సైతం గెలవాలనే పట్టుదలతో ఉంది. రోహిత్, కోహ్లీ, బూమ్రా ఈ సిరీస్కు దూరం ఉండగా.. కేఎల్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. సంజూ శాంసన్ తుది జట్టులోకి రాగా రింకూ సింగ్ను పక్కన బెట్టారు. మరోవైపు సొంతగడ్డపై టీ20 సిరీస్ ఓడిన సఫారీ జట్టు వన్డేల్లోనైనా సత్తాచాటాలని చూస్తోంది. రెగ్యులర్ కెప్టెన్ బవుమాకు ఈ సిరీస్ నుంచి రెస్ట్ ఇవ్వగా.. మార్క్రామ్ టీంను నడిపిస్తున్నాడు. అతడితో పాటు హెన్రిక్స్, డసెన్, క్లాసెన్, మిల్లర్, ఆండిలే ఫెహ్లుక్వాయోతో సౌతాఫ్రికా టీం పటిష్టంగా ఉంది.
ఇండియా జట్టు : కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, శ్రేయాస్ అయ్యర్, తిలక్ వర్మ, సంజు శాంసన్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్
సౌతాఫ్రికా జట్టు : రీజా హెండ్రిక్స్, టోనీ డి జోర్జి, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, ఆండిలే ఫెహ్లుక్వాయో, కేశవ్ మహరాజ్, నాండ్రే బర్గర్, తబ్రైజ్ షమ్సీ