Home > క్రీడలు > IND vs SA : భారత బౌలర్ల దెబ్బకు కుప్పకూలిన సౌతాఫ్రికా టాప్ ఆర్డర్

IND vs SA : భారత బౌలర్ల దెబ్బకు కుప్పకూలిన సౌతాఫ్రికా టాప్ ఆర్డర్

IND vs SA : భారత బౌలర్ల దెబ్బకు కుప్పకూలిన సౌతాఫ్రికా టాప్ ఆర్డర్
X

ప్రపంచకప్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో భారత బౌలర్లు దుమ్ములేపారు. తక్కువ స్కోర్కే సఫారీల టాప్ ఆర్డర్ను కుప్పకూల్చారు. టీమిండియా బౌలర్ల దెబ్బకు సౌతాఫ్రికా 13 ఓవర్లలో 40 రన్స్కే 5వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ ఐదుగురు బ్యాట్స్మెన్లలో ఒక్కరు కూడా 15రన్స్ దాటలేదు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమి చెరో 2 వికెట్లు తీయగా.. మహ్మద్‌ సిరాజ్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50ఓవర్లలో 326 రన్స్ చేసింది. బర్త్ డే బాయ్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. 121 బాల్స్లో 101 రన్నులు చేసి టీమిండియా భారీ స్కోర్ చేయడంలో కీలకంగా నిలిచాడు. రోహిత్ 40, గిల్ 23 రన్స్ కే ఔటైనా.. కోహ్లీ శ్రేయస్ అయ్యర్ తో కలిసి కీలక పార్టనర్షిప్ నెలకొల్పాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్కు 134 రన్స్ జోడించారు. 77 రన్స్ అయ్యర్.. మార్క్రామ్కు క్యాచ్ ఔటవ్వగా.. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్లతో కలిసి కోహీ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాడు. చివర్లో వచ్చిన జడేజా 15బంతుల్లో 29 రన్స్ చేసి రాణించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, తబ్రైజ్ షమ్సీ, కగిసో రబడ, లుంగీ న్గిడి తలో వికెట్ తీశారు.





Updated : 5 Nov 2023 2:28 PM GMT
Tags:    
Next Story
Share it
Top