Home > క్రీడలు > IND vs AUS: శుభ్మన్ గిల్ ప్లేస్లో కొత్త ప్లేయర్.. ఎవరో గుర్తుపట్టారా?

IND vs AUS: శుభ్మన్ గిల్ ప్లేస్లో కొత్త ప్లేయర్.. ఎవరో గుర్తుపట్టారా?

IND vs AUS: శుభ్మన్ గిల్ ప్లేస్లో కొత్త ప్లేయర్.. ఎవరో గుర్తుపట్టారా?
X

జార్వో.. క్రికెట్ లో ఈ పేరొక సంచలనం. అయితే ఇతనో గొప్ప ప్లేయర్, కోస్ ఏం కాదు. కానీ రెండేళ్లుగా భారత అభిమానులకు సుపరిచితం. 2021లో భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ లో జార్వో ప్రత్యక్షమయ్యాడు. పదే పదే భారత జెర్సీ ధరించి గ్రౌండ్ లోకి 12వ ప్లేయర్ గా ఎంట్రీ ఇచ్చేవాడు. ఆటగాళ్లో కలిసిపోయేవాడు. దీంతో మ్యాచ్ కు అంతరాయం ఏర్పడేది. ఇక అప్పటి నుంచి ‘జార్వో 69’ (అలియాస్ డేనియెల్‌ జార్విస్‌) అందరికి సుపరిచితం. అయితే అప్పుడు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ అతన్ని మ్యాచ్ లకు హాజరు కాకుండా నిషేదించింది. ఇక అప్పటి నుంచి మళ్లీ అతను కనిపించలేదు. కానీ చెపాక్ లో జరుగుతున్న భారత్- ఆస్ట్రేలియా మ్యాచ్ లో జార్వో మళ్లీ కనిపించాడు. టీమిండియా జెర్సీ వేసుకుని గ్రౌండ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.





టీమిండియా ఫీల్డింగ్ చేస్తున్న టైంలో సెక్యూరిటీ కళ్లుగప్పి గ్రౌండ్ లోకి ప్రవేశించాడు జార్వో. దీంతో మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది జార్వోను బయటికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దానికి అతను ససేమిరా అనడంతో.. వెంటనే రంగంలోకి దిగిన విరాట్ కోహ్లీ అతనితో మాట్లాడి గ్రౌండ్ నుంచి పంపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక జార్వోపై ఐసీసీ చర్యలకు దిగింది. ఇకపై ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్లకు హాజరు కాకుండా అతనిపై నిషేధం విధించింది.










Updated : 8 Oct 2023 8:24 PM IST
Tags:    
Next Story
Share it
Top