IND vs BAN: స్పిన్నర్ల రాకతో.. గాడిన పడ్డ టీమిండియా
బంగ్లాదేశ్ తో మ్యాచ్.. టీమిండియా సింపుల్ గా గెలుస్తుంది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. మేమేం తక్కువ కాదన్నట్లు బ్యాటింగ్ చేస్తున్నారు బంగ్లాదేశ్ బ్యాటర్లు. పుణెలో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బంగ్లా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు మొదటి నాలుగు ఓవర్లు కాస్త ఇబ్బంది పడ్డా తర్వాత రాణించారు. బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించారు. ఓపెనర్లు తజిద్ హసన్ (51, 43 బంతుల్లో, 5 ఫోర్లు, 3 సిక్సర్లు), లిట్టన్ దాస్ (66, 82 బంతుల్లో, 7 ఫోర్లు) టీమిండియాకు చెమటలు పట్టించారు.
ఈ క్రమంలో స్పిన్నర్ల ఎంట్రీతో మ్యాచ్ భారత్ చేతిలోకి వచ్చింది. కుల్దీప్ యాదవ్, తజిద్ ను ఎల్బీడబ్ల్యూ చేయగా.. లిట్టన్ దాస్ ను జడేజా పెవిలియన్ చేర్చాడు. మూడో వికెట్ లో వచ్చిన కెప్టెన్ షాంటో (8) కూడా జడేజాకు దొరికిపోయాడు. హసన్ మిరాజ్ (3)ను సిరాజ్ ఔట్ చేశాడు. దీంతో టీమిండియా గాడిన పడింది. వెంట వెంటనే వికెట్లు తీసి మ్యాచ్ ను తిరిగి చేతుల్లోకి తీసుకుంది. కాగా 30 ఓవర్లలో బంగ్లా 4 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది.