Home > క్రీడలు > IND vs SL: కొలంబోలో వికెట్ల వర్షం.. 50 పరుగులకే కుప్పకూలిన లంక

IND vs SL: కొలంబోలో వికెట్ల వర్షం.. 50 పరుగులకే కుప్పకూలిన లంక

IND vs SL: కొలంబోలో వికెట్ల వర్షం.. 50 పరుగులకే కుప్పకూలిన లంక
X

ఇది ఫైనల్ మ్యాచా..? శ్రీలంక ఆడుతుంది సొంత గడ్డపైనేనా..? వరుసగా 13 మ్యాచ్ లు గెలిచి ఆసియా కప్ లో అడుగుపెట్టిన జట్టేనా..? సూపర్ 4లో భారత్ ను ఓడించినంత పనిచేసిన ఆటగాళ్లేనా..? ఇది భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ చూస్తున్న వాళ్ల ఫ్యాన్స్ పరిస్థితి. ఫైనల్ మ్యాచ్ లో రసవత్తర పోరు ఉంటుందని భావించిన అభిమానులకు నిరాశ మిగిలింది. మ్యాచ్ పూర్తిగా వన్ సైడ్ అయింది. భారత బౌలర్ల దాటికి శ్రీలంక బ్యాటర్లు చేతులెత్తేశారు. ఫలితంగా 15.2 ఓవర్లలో 50 పరుగులు మాత్రమే చేసిన లంక ఆలౌట్ అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక.. ఏ దశలోనూ భారత్ కు పోటీ ఇవ్వలేకపోయింది. లంక బ్యాటర్లలో 5 బ్యాటర్లు డకౌట్ కాగా.. ఇద్దరు మినహా ఏ బ్యాట్స్ మెన్ రెండంకెల స్కోర్ చేయలేదు.





మహమ్మద్ సిరాజ్ 6/21 వికెట్లు తీసి లంక పతనానికి పునాది వేశాడు. కెరీర్ లో బెస్ట్ స్పెల్ ను సాధించాడు. పాండ్యా 3 వికెట్లతో సత్తా చాటగా.. బుమ్రా ఇన్నింగ్స్ మొదటి ఓవర్లో వికెట్ తీసి భారత్ కు శుభారంబాన్ని అందించాడు. లంక బ్యాటర్లు కుశాల్ మెండీస్ (17), దుశాన్ హేమంత (13) టాప్ స్కోరర్స్. దీంతో శ్రీలంక ఖాతాలో మరో లోయెస్ట్ టీం టోటల్ స్కోర్ జత అయింది. 43 vs సౌతాఫ్రికా (2012), 50 vs భారత్ (2023), 55 vs వెస్టిండీస్ (1986), 67 vs ఇంగ్లండ్ (2014), 73 vs భారత్ (2023) సార్లు లంక 100 పరుగుల లోపు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ తో సిరాజ్ వన్డేల్లో భారత్ తరుపున అత్యుత్తమ బౌలింగ్ చేసిన వారి జాబితాలో చేరాడు. సిరాజ్ ముందు..

6/4 స్టువర్ట్ బిన్నీ vs బంగ్లాదేశ్ (మీర్పూర్ 2014),

6/12 అనిల్ కుంబ్లే vs వెస్టిండీస్ (కోల్‌కతా 1993), 6/19 జస్ప్రీత్ బుమ్రా vs ఇంగ్లండ్ (ది ఓవల్ 2022) ఉన్నాయి.




Updated : 17 Sept 2023 5:39 PM IST
Tags:    
Next Story
Share it
Top