క్రికెట్కు గుడ్బై.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్
X
శ్రీలంక టాప్ ఆర్డ్ బ్యాట్స్ మెన్ లాహిరు తిరిమన్నె అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. తన 13 ఏళ్ల క్రికెట్ ప్రస్థానానికి శనివారం (జులై 22) గుడ్ బై చెప్పాడు. సోషల్ మీడియా ద్వారా ఎమోషనల్ పోస్ట్ పెట్టిన లాహిరు.. ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘నేను నా దేశం కోసం ఎంతో నిబద్ధతతో ఆడా. రిటైర్మెంట్ తీసుకోవడం చాలా కష్టమైన నిర్ణయం. చాలా కారణాలతో కెరీర్ కు గుడ్ బై చెప్తున్నా. వాటి గురించి ఇప్పుడు చెప్పలేను. నా కెరీర్లో అండగా నిలిచిన వాళ్లందరికీ ధన్యవాదాలు’ అని లాహిరు పోస్ట్ చేశాడు.
లాహిరు తిరుమన్నె కెరీర్ విషయానికొస్తే.. శ్రీలంక తరఫున 2010లో అరంగేట్రం చేసిన ఆయన.. 44 టెస్టులు, 127 వన్డేలు, 26 టీ20 మ్యాచ్ లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో ఏడు సెంచరీలతో 5543 పరుగులు చేశారు. టెస్టుల్లో 3 సెంచరీలు, 10 అర్ధ సెంచరీలు చేసి 2088 పరుగులు సాధించాడు. 127 వన్డేల్లో 4 సెంచరీలు, 21 అర్ధ సెంచరీలతో 3194 పరుగులు చేశాడు. 26 టీ20ల్లో 291 పరుగులు సాధించాడు.
Lahiru Thirimanne announces his retirement from cricket.
— CricTracker (@Cricketracker) July 22, 2023
We wish him all the best for his new journey. pic.twitter.com/TygWD5iwzg