Home > క్రీడలు > IND vs SL : శ్రేయస్ అయ్యర్కు చివరి అవకాశం..? బ్యాటింగ్ చేయనున్న భారత్

IND vs SL : శ్రేయస్ అయ్యర్కు చివరి అవకాశం..? బ్యాటింగ్ చేయనున్న భారత్

IND vs SL : శ్రేయస్ అయ్యర్కు చివరి అవకాశం..? బ్యాటింగ్ చేయనున్న భారత్
X

వాంఖడే వేదికపై టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. సేమ్ జట్టుతో టీమిండియా బరిలోకి దిగుతుండగా.. శ్రేయస్ అయ్యర్ కు ఇదే చివరి అవకాశం అని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచుల్లో అయ్యార్ కు అవకాశం రాగా.. ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. ఈ క్రమంలో జట్టును రిస్క్ లో పెట్టొద్దని సీనియర్ల సలహా. కాగా వాంఖడే పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుండటంతో.. భారీ స్కోర్ వచ్చే అవకాశం ఉంది. భారత బ్యాటర్లంతా ఫామ్ లో ఉండటంతో లంక బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయం అని అభిమానులు అంటున్నారు.

తుది జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (w), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్

శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుసల్ మెండిస్ (w/c), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, దుషన్ హేమంత, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దుష్మంత చమీర, దిల్షన్ మధుశంక




Updated : 2 Nov 2023 2:03 PM IST
Tags:    
Next Story
Share it
Top