Home > క్రీడలు > చెలరేగిన న్యూజిలాండ్ బౌలర్లు.. తక్కవ స్కోర్కే శ్రీలంక ఆలౌట్

చెలరేగిన న్యూజిలాండ్ బౌలర్లు.. తక్కవ స్కోర్కే శ్రీలంక ఆలౌట్

చెలరేగిన న్యూజిలాండ్ బౌలర్లు.. తక్కవ స్కోర్కే శ్రీలంక ఆలౌట్
X

బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో న్యూజిలాండ్ బౌలర్లు చెలరేగారు. సెమీస్కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో శ్రీలంకను తక్కువ స్కోర్కే కుప్పకూల్చారు. కివీస్ బౌలర్ల ధాటికి శ్రీలంకగా 46.4 ఓవర్లలో 171 రన్స్కే ఆలౌట్ అయ్యింది. కుశాల్ పెరీరా 51, మహేశ్ తీక్షణ 39 రన్స్తో రాణించగా.. మిగితా బ్యాట్మెన్స్ అందరూ 20లోపే ఔట్ అయ్యారు. ట్రెంట్ బౌల్ట్ 3 వికెట్లు పడగొట్టగా.. లాకీ ఫెర్గూసన్ 2, మిచెల్ సాంట్నర్ 2, రచిన్ రవీంద్ర 2, టిమ్ సౌథి ఒక వికెట్ తీశారు.


Updated : 9 Nov 2023 5:46 PM IST
Tags:    
Next Story
Share it
Top