Home > క్రీడలు > Asia cup final : టాస్ గెలిచిన శ్రీలంక.. భారత్ బౌలింగ్..

Asia cup final : టాస్ గెలిచిన శ్రీలంక.. భారత్ బౌలింగ్..

Asia cup final : టాస్ గెలిచిన శ్రీలంక.. భారత్ బౌలింగ్..
X

ఆసియా కప్ తుది పోరుకు అంతా సిద్ధమైంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో టీమిండియా, శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ బౌలింగ్ చేయనుంది. గత 15 ఆసియా కప్ టోర్నీల్లో టీమ్ ఇండియా మొత్తం 10 సార్లు ఫైనల్ ఆడింది. ఫైనల్‌లో మూడుసార్లు ఓడిపోయింది. అది కూడా శ్రీలంకపైనే కావడం టీమిండియా అభిమానులనును ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో ఈరోజు జరగనున్న ఫైనల్స్ను టీమిండియా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

ఈ మ్యాచ్లో టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చాడు. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో అక్షర్ గాయపడ్డాడు. అటు శ్రీలకం కూడా ఒక మార్పుతో బరిలోకి దిగింది. గాయపడ్డ తీక్షణ స్థానంలో దుషాన్‌ హేమంతను జట్టులోకి తీసుకుంది.

టీమిండియా : రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్

శ్రీలంక : పతుమ్ నిస్సాంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్, సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దసున్ షనక, దునిత్ వెల్లలగే, దుషాన్ హేమంత, ప్రమోద్ మదుషన్, మతీష పతిరణ





Updated : 17 Sep 2023 9:31 AM GMT
Tags:    
Next Story
Share it
Top