Home > క్రీడలు > వరల్డ్ కప్ ముందు ఆసీస్‎ గుండెల్లో గుబులు

వరల్డ్ కప్ ముందు ఆసీస్‎ గుండెల్లో గుబులు

వరల్డ్ కప్ ముందు ఆసీస్‎ గుండెల్లో గుబులు
X

వరల్డ్‎కప్ రెండు నెలల్లో వచ్చేస్తోంది. అన్ని ప్రధాన జట్లు ప్రపంచ్ కప్‎పై కన్నేశాయి. ఆస్ట్రేలియా తన ఖాతాలో మరో ప్రపంచ్ కప్‎ను చేర్చాలని భావిస్తోంది. అయితే మెగాటోర్నికి ముందు

ఆస్ట్రేలియాను గాయాల బెడద వేధిస్తోంది. ఇద్దరు కీలక ఆటగాళ్ల ఫిటెనెస్‌ కలవరపెడుతోంది. ఆటీమ్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌తో పాటు, స్టీవ్ స్మిత్‎లు గాయాల నుంచి ఇంకా కోలుకోలేదు. దీంతో వారిద్దరిని దక్షిణాఫ్రికా టూర్‌‎కు ఎంపిక చేయలేదు.

యాషెస్ సిరీస్ సందర్భంగా గాయపడిన స్మిత్ కోలుకునేందుకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. మరో రెండు నెలల్లో ప్రపంచ్ కప్ ఉండడంతో అతడి దక్షిణాఫ్రికా టూర్‌లో రిస్క్ చేయొద్దని ఆసీస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే అతడికి నాలుగు వారాలు విశ్రాంతి కల్పించారు. మరోవైపు స్టార్క్ కూడా ఐదు వారాలు ఆటకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు వరల్డ్ కప్ నాటికి 100 శాతం ఫిట్ నెస్ సాధిస్తారా అని అభిమానుల్లో కంగారు మొదలైంది.

దక్షిణాఫ్రికా టూర్‌లో భాగంగా ఆస్ట్రేలియా మూడు టీ20లు, ఐదు వన్డేల సిరీస్‎లో తలపడనుంది. సైతాఫ్రికా టీ20 సిరీస్‌కు స్మిత్ స్థానంలో అస్టన్ టర్నర్ అవకాశం కల్పించగా, వన్డేల్లో లబూషేన్ కు ఛాన్స్ ఇచ్చారు. అదే విధంగా స్టార్క్ స్థానాన్ని యువ పేసర్ జాన్సన్‌తో భర్తీ చేశారు.

ఆస్ట్రేలియా టీ20 జట్టు: మిచెల్ మార్ష్ (సి), సీన్ అబాట్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, జాన్సన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాట్ షార్ట్, మార్కస్ స్టోయినిస్, అష్టన్ టర్నర్, ఆడమ్ జంపా.

ఆస్ట్రేలియా వన్డే జట్టు: మిచెల్ మార్ష్ (సి), సీన్ అబాట్, అష్టన్ అగర్, అలెక్స్ కారీ, పాట్ కమిన్స్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సన్, మార్నస్ లాబుషేన్, గ్లెన్ మాక్స్‌వెల్, షార్ట్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా


Updated : 18 Aug 2023 4:44 PM IST
Tags:    
Next Story
Share it
Top