Home > క్రీడలు > విరుచుకుపడ్డ స్టోయినిస్.. ఇంకో ఓవర్ మిగిలి ఉండగానే..!

విరుచుకుపడ్డ స్టోయినిస్.. ఇంకో ఓవర్ మిగిలి ఉండగానే..!

విరుచుకుపడ్డ స్టోయినిస్.. ఇంకో ఓవర్ మిగిలి ఉండగానే..!
X

మెల్ బోర్న్ స్టార్స్ జట్టు న్యూఇయర్ కు గ్రాండ్ వెల్ కం చెప్పింది. బిగ్‌బాష్‌ లీగ్‌లో భాగంగా.. ఆడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెల్‌బోర్న్‌ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆడిలైడ్ స్ట్రైకర్స్ నాలుగు వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ లక్ష్యాన్ని మెల్ బోర్న్ జట్టు 3 వికెట్లు మాత్రమే కోల్పోయి.. ఒక ఓవర్ మిగిలుండగానే చేదించింది. కాగా ఈ టోర్నీలో ఇదే అత్యధిక లక్ష్య చేదన కావడం విశేషం. మెల్‌బోర్న్‌ బ్యాటర్లలో మార్కస్‌ స్టాయినిస్ (55*; 19 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) విధ్వంసం సృష్టించాడు. డానియల్ లారెన్స్‌ (50; 26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), బ్యూ వెబ్‌స్టర్ (66*; 48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా హాఫ్ సెంచరీలు చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు.

స్టోయినిస్ ఊచకోతతో 206 పరుగుల భారీ లక్ష్యాన్ని 19 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి మెల్ బోర్న్ ఛేదించింది. 19వ ఓవర్ లో స్టోయినిస్ 24 పరుగులు రాబట్టాడు. చివరి మూడు బంతులు 4,6,6 గా మలిచి.. హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఈ మ్యాచ్‌ను స్టేడియంలో రికార్డు స్థాయిలో 42,504 మంది అభిమానులు వీక్షించారు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత స్టేడియంలో బాణాసంచా కాల్చి న్యూ ఇయర్‌ వేడుకలు జరుపుకున్నారు. క్రిస్ లిన్ కూడా మెల్ బోర్న్ జట్టుపై విరుచుకుపడ్డాడు. 83; 42 బంతుల్లో (10 ఫోర్లు, 4 సిక్స్‌లు) చేశాడు. మాథ్యూ షార్ట్ (56; 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ చేశాడు.

Updated : 31 Dec 2023 9:15 PM IST
Tags:    
Next Story
Share it
Top