Home > క్రీడలు > IPL Auction 2024: ఇన్స్టా, ట్విట్టర్లో వార్నర్ను బ్లాక్ చేసిన సన్రైజర్స్.. అసలేం జరిగింది..?

IPL Auction 2024: ఇన్స్టా, ట్విట్టర్లో వార్నర్ను బ్లాక్ చేసిన సన్రైజర్స్.. అసలేం జరిగింది..?

IPL Auction 2024: ఇన్స్టా, ట్విట్టర్లో వార్నర్ను బ్లాక్ చేసిన సన్రైజర్స్.. అసలేం జరిగింది..?
X

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు.. ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ కు విడదీయలేని బంధం ఉంటుంది. 2014 ఐపీఎల్ వేలంలో సన్ రైజర్స్ ను కొనుగోలు చేయగా.. అప్పటి నుంచి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. తర్వాత సీజన్లలో జట్టును మెరుగైన ఆట ఆడటంలో కీలక పాత్ర పోషించాడు. 2015లో కెప్టెన్‌గా ఎంపికై.. తర్వాతి సంవత్సరం జట్టుకు తొలి టైటిల్‌ను అందించాడు. ఆ సీజన్ లో 848 పరుగులు చేసి.. సన్ రైజర్స్ కప్పు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2018 బాల్ ట్యాంపరింగ్ వివాధం తర్వాత తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టినా.. మెరుగైన ప్రదర్శన చేయని కారణంగా 2020లో కెప్టెన్సీ నుంచి తప్పించింది. 2021లో జట్టునుంచి తప్పించగా.. ఢిల్లీ క్యాపిటల్స్ వార్నర్ ను వేలంలో కొనుగోలు చేసింది.

హైదరాబాద్ ప్లేస్ కు, ఫ్యాన్స్ కు తానెప్పుడు కృతజ్ఞతతో ఉంటానని, జట్టు మారినా హైదరాబాద్ వారంతా తన వారని వార్నర్ ఎప్పుడూ చెప్తుంటాడు. సోషల్ మీడియాలో ఎప్పుడూ అభిమానులకు టచ్ లో ఉంటాడు. తెలుగు పాటలు, డైలాగ్స్ లో రీల్స్ చేస్తూ అలరిస్తుంటాడు. అలా తన బంధాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూ వస్తున్నాడు. అయితే తాజా ఆక్షన్ లో సన్ రైజర్స్ ట్రావిస్ హెడ్, పాట్ కమ్మిన్స్ ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ట్రావిస్ హెడ్ కు, సన్ రైజర్స్ కు కంగ్రాట్స్ చెప్తూ.. వార్నర్ ట్విట్టర్ లో, ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో వార్నర్ కు షాక్ తగిలింది. అప్పటికే సన్ రైజర్స్ తన అఫీషియల్ ట్విట్టర్, ఇన్ స్టా పేజుల్లో వార్నర్ ను బ్లాక్ చేసింది. ఈ విషయం గమనించిన వార్నర్.. విస్తుపోయి ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. అయితే వార్నర్ ను సన్ రైజర్స్ ఎందుకు బ్లాక్ చేసింది అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది.

Updated : 19 Dec 2023 5:58 PM IST
Tags:    
Next Story
Share it
Top