Home > క్రీడలు > SKY : టీ20 క్రికెటర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద ఇయర్‌‌‌‌ రేస్‌‌‌‌లో సూర్య కుమార్ యాదవ్

SKY : టీ20 క్రికెటర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద ఇయర్‌‌‌‌ రేస్‌‌‌‌లో సూర్య కుమార్ యాదవ్

SKY : టీ20 క్రికెటర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద ఇయర్‌‌‌‌ రేస్‌‌‌‌లో సూర్య కుమార్ యాదవ్
X

సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డెవిలియర్స్ పేరు చెప్తే గుర్తొచ్చేది మొదట గుర్తొచ్చేది అతని షార్ట్ లు. స్టేడియంలోని ఏ మూలను వదలకుండా బౌండరీలు బాదుతూ.. మిస్టర్ 360 అని పేరు తెచ్చుకున్నాడు. అతని తర్వాత తన వారసత్వాన్ని టీమిండియా బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ కొనసాగిస్తున్నాడు. స్కై ఈస్ ద లిమిట్ అంటూ.. స్టేడియంలో బౌండరీల మోత మోగిస్తాడు. వీరిద్దరికీ సిమిలారిటీ ఏంటంటే.. వీళ్లు ఆడే షాట్లు కొత్తగా ఉండటమే కాకుండా, ఇప్పటి వరకు క్రికెట్ లో ఎవరూ ఆడగా చూడలేదంటారు.

కాగా ప్రస్తుతం సూర్య కుమార్ టీ20ల్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. గత కొంత కాలంగా పరుగుల వరద పారిస్తూ.. టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. గతేడాది 17 ఇన్నింగ్స్ ల్లో 733 పరుగులు చేశాడు. అతని యావరేజ్ 48.66 గా, స్ట్రైక్ రేట్ 155.95గా ఉంది. దీంతో 2023 ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ధ ఇయర్ అవార్డ్ రేసులో ఉన్నాడు సూర్య. 2022లోనూ సూర్య ఈ అవార్డ్ గెలుచుకున్నాడు.

ఇక ఈ అవార్డ్ రేసులో సికిందర్‌‌‌‌ రజా (జింబాబ్వే), మార్క్‌‌‌‌ చాప్‌‌‌‌మన్‌‌‌‌ (న్యూజిలాండ్‌‌‌‌), అల్పేష్‌‌‌‌ రామ్జాని (ఉగాండ) కూడా ఈ అవార్డు కోసం పోటీపడుతున్నారు. ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ రేసులో నలుగురు నామినీలను ఎంపిక చేసింది ఐసీసీ. టీమిండియా యంగ్ ప్లేయర్ యశస్వి జైశ్వాల్, రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్), గెరాల్డ్ కోయెట్జీ (సౌతాఫ్రికా), దిల్షాన్ మధుషనక (శ్రీలంక) ఈ అవార్డ్ కోసం పోటీ పడుతున్నారు. గతేడాది యశస్వి జైశ్వాల్ టెస్టుల్లో 283, టీ20ల్లో 430 పరుగులు చేశాడు.

Updated : 4 Jan 2024 12:08 PM IST
Tags:    
Next Story
Share it
Top