Home > క్రీడలు > Last Chance For Sanju: బీసీసీఐ దగ్గర టైం లేదు.. సంజూ శాంసన్కిదే చివరి అవకాశం

Last Chance For Sanju: బీసీసీఐ దగ్గర టైం లేదు.. సంజూ శాంసన్కిదే చివరి అవకాశం

Last Chance For Sanju: బీసీసీఐ దగ్గర టైం లేదు.. సంజూ శాంసన్కిదే చివరి అవకాశం
X

ఐపీఎల్ లో రాణించిన, కెప్టెన్సీ చేసిన ప్రతీ ఒక్కరికి జాతీయ జట్టులో చోటు లభిస్తుంది. గతంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఇప్పుడు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, శుభ్ మన్ గిల్ ఇలా ప్రతీ ఒక్కరు టీమిండియాలో పాతుకు పోయినవాళ్లే. కానీ ఒకే ఒక్క ఐపీఎల్ కెప్టెన్ మాత్రం జాతీయ జట్టులో అడపాదడపా అవకాశాలు దక్కించుకుంటున్నాడు. వచ్చిన అవకాశాల్ని ప్రతీసారి చేజార్చుకుంటున్నాడు. అతనెవరో కాడు సంజూ శాంసన్. ఇప్పుడు అఫ్గనిస్తాన్‌తో జరగబోయే టీ20 సిరీస్‌ కోసం ఎంపిక చేసిన జట్టులో స్థానం సంపాదించాడు. అయితే ఇదే అతనికి లాస్ట్ చాన్సా అంటే.. అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే..

సంజూ శాంసన్ ప్రతిభకు కొదవలేదు. తన దూకుడైన ఆటతీరుతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తుంటాడు. అయినా జాతీయ జట్టులో అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో ఇచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేదని.. విశ్లేషకులు విమర్శిస్తుంటారు. ఈ క్రమంలోనే గత నెలలో సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ లో చాన్స్ కొట్టేశాడు. అయితే కెప్టెన్ గా, కీపర్ గా కేఎల్ రాహుల్ జట్టులో ఉండటంతో.. సంజూకు ఆడే అవకాశం రాదని అనుకునన్నారంతా. కానీ అనూహ్యంగా.. జట్టులో చోటు దక్కించుకున్నాడు. మూడు మ్యాచ్ లు ఆడాడు. మొదటి రెండు మ్యాచుల్లో మళ్లీ అదే తీరు. 11, 0 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో సంజూ ఇక మారడు. అవకాశాలు ఇచ్చి వృధా అని మండిపడ్డారంతా. ఈ క్రమంలో చివరి మ్యాచ్ లో సెంచరీ చేసి జట్టుకు కీలక విజయాన్ని అందించాడు. దాంతో ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే టీ20 సిరీస్ లో చోటు దక్కించుకున్నాడు.

సంజూ చివరిసారి టీ20 సిరీస్ లో ఆడింది.. గతేడాది ఐర్లాండ్ పై. ఇక అప్పుడు కూడా కేఎల్ రాహుల్ కు విశ్రాంతినివ్వడంతో జట్టులోకి వచ్చాడు. ఇప్పుడు కూడా అదే జరిగింది. అయితే టీ20 వరల్డ్ కప్ కు ముందు భారత్ ఆడే చివరి టీ20 సిరీస్ ఇదే కావొచ్చు. ఎందుకంటే.. ఈ సిరీస్ తర్వాత ఐపీఎల్ నిర్వహించే అవకాశం ఉంది. కాగా ఇప్పడు శాంసన్ కు ఇచ్చిన అవకాశాన్ని తప్పకుండా అందిపుచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ తన ఆటను రుజువు చేసుకుంటేనే.. టీ20 వరల్డ్ కప్ లో స్థానం దక్కుతుంది. ఈ విషయం బాగా అర్థమైన సంజూ.. సౌతాఫ్రికా పర్యటన ముగించుకుని రాగాన రంజీ మ్యాచులు ఆడాడు. కేరళ కెప్టెన్ గా బరిలోకి దిగిన సంజూ.. ఉత్తర్ ప్రదేశ్ పై 46 బంతుల్లో 35 పరుగులు చేశాడు. తర్వాత జరిగే మెగా ఈవెంట్ల కోసం రంజీల్లో కష్టపడుతున్నాడు.




Updated : 9 Jan 2024 1:00 PM GMT
Tags:    
Next Story
Share it
Top