Home > క్రీడలు > టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్.. ఒకే గ్రూప్లో..

టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్.. ఒకే గ్రూప్లో..

టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్.. ఒకే గ్రూప్లో..
X

పొట్టి క్రికెట్ టోర్నీకి రంగం సిద్ధమైంది. అమెరికా - వెస్టిండీస్ దేశాల్లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదలైంది. జూన్ 1న మొదలుకానున్న ఈ టోర్నీ 29న జరిగే ఫైనల్ మ్యాచ్తో ముగుస్తుంది. ఈ సారి ఏకంగా 20 జట్లు తలపడుతుండడం విశేషం. ఇక వరల్డ్ కప్ అంటే అందరూ ఎదురు చూసేది భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ కోసమే. ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎప్పుడూ ప్రత్యేకమే. ఇక వరల్డ్ కప్లో అంటే.. ఆ ఉత్సాహం, ఉత్కంఠ అభిమానుల్లో వేరే లెవెల్లో ఉంటుంది.

ఇంతకుముందు ఇరు జట్ల మధ్య దైపాక్షిక సిరీస్లు నిర్వహించేవారు. కొన్ని సెక్యూరిటీ కారణాలవల్ల వాటిని ఆపేశారు. అభిమానుల హైప్ను దృష్టిలో పెట్టుకుని ఐసీసీ కూడా 2013 నుంచి ఏ మెగా ఈవెంట్ జరిగినా.. అందులో ఇండియా- పాకిస్తాన్ జట్లను ఒకే గ్రూప్లో ఉండేలా చూస్తున్నారు. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. ఇప్పుడు కూడా ఇరు జట్లను ఒకే గ్రూప్లో ఉంచింది ఐసీసీ. భారత్ మ్యాచ్ల విషయానికి వస్తే.. జూన్ 5న ఐర్లాండ్తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ జూన్ 9న న్యూయార్క్ సిటీలో జరగనుంది.

2022 టీ20 వరల్డ్ కప్లో ఇరు జట్ల మధ్య సమరం ఏ రేంజ్లో జరిగిందో అందరికీ తెలిసిందే. మెల్బోర్న్ వేదికపై 90,000 మంది ప్రేక్షకుల మధ్య జరిగిన ఈ మ్యాచ్లో.. విరాట్ కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను గెలిపించాడు. కాగా భారత్ గ్రూప్ మ్యాచులన్నీ అమెరికా వేదికపైనే జరగనున్నాయి. జూన్ 29న బార్బడోస్లో ఫైనల్ మ్యాచ్ తో టోర్నీ ముగుస్తుంది. కాగా టీంలను మొత్తం నాలుగు గ్రూపులుగా ఐసీసీ విభజించింది.

గ్రూప్ A - భారత్, పాకిస్థాన్, ఐర్లాండ్, కెనడా, అమెరికా

గ్రూప్ B - ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్

గ్రూప్ C - న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్థాన్, ఉగాండా, పాపువా న్యూగినియా

గ్రూప్ D - సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్





Updated : 5 Jan 2024 9:51 PM IST
Tags:    
Next Story
Share it
Top