Home > క్రీడలు > హైదరాబాద్ కుర్రాడి విధ్వంసం.. 147 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ

హైదరాబాద్ కుర్రాడి విధ్వంసం.. 147 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ

హైదరాబాద్ కుర్రాడి విధ్వంసం.. 147 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ
X

రంజీ ట్రోఫీలో హైదరాబాద్ కుర్రాడు అదరగొట్టాడు. 147 బంతులకే 300 పరుగులు చేసి ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పాడు. రంజీ ట్రోఫీ 2003-24 సీజన్‌లో హైదరాబాద్ బ్యాటర్ తన్మయ్ అగర్వాల్ ట్రిపుల్ సెంచరీ చేసి సంచలనం రేకెత్తించాడు. శుక్రవారం అరుణాచల్ ప్రదేశ్‌ జట్టుతో హైదరాబాద్ జట్టు తలపడింది. ఈ మ్యాచ్‌లో తన్మయ్ ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఈ నేపథ్యంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యంత వేగంగా ట్రిపుల్ సెంచరీ చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.

తన్మయ్ మొదటి నుంచి టీ20 మ్యాచ్ తరహాలో దంచికొడుతూ స్కోరును ముందుకు కదిలించాడు. ఈ క్రమంలో 147 బంతుల్లోనే 300 మార్కును అందుకుని అరుదైన ఘనతను సాధించడం విశేషం. తన్మయ్ తన ఇన్నింగ్స్‌లో 20 సిక్సర్లు బాదాడు. సౌతాఫ్రికా క్రికెటర్ మార్కో మరేస్ పేరుపై ఉన్న రికార్డును తన్మయ్ బద్దలు కొట్టాడు. గతంలో సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌లో బోర్డర్ జట్టుకు మార్కో ప్రాతినిథ్యం వహిస్తూ ఈస్టర్న్ ప్రావిన్స్ మీద 191 బంతుల్లో 300 పరుగులు సాధించాడు. అయితే తన్మయ్ 147 బంతుల్లోనే ఈ మార్కును అందుకోవడం విశేషం.

ఇక ఇదే మ్యాచ్‌లోనే తన్మయ్ అగర్వాల్ మరో రికార్డును సాధించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన భారత బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. 39 ఏళ్లుగా టీమిండియా మాజీ బ్యాటర్ రవిశాస్త్రి పేరుపై ఈ రికార్డు ఉండేది. ఇప్పుడు ఆ రికార్డును త్మయ్ బ్రేక్ చేశాడు. 119 బంతుల్లోనే 200 పరుగులు చేసి ఆ ఘనతను సాధించాడు. అద్భుత రికార్డును నెలకొల్పాడు. తన్మయ్ అగర్వాల్ ట్రిపుల్ సెంచరీ సాధించడం పట్ల పలువురు క్రికెటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



Updated : 26 Jan 2024 8:11 PM IST
Tags:    
Next Story
Share it
Top