Home > క్రీడలు > మహిళలు ఉద్యోగం చేస్తే.. సమాజం నాశనం అవుతుంది: క్రికెటర్

మహిళలు ఉద్యోగం చేస్తే.. సమాజం నాశనం అవుతుంది: క్రికెటర్

మహిళలు ఉద్యోగం చేస్తే.. సమాజం నాశనం అవుతుంది: క్రికెటర్
X

హసన్ షకీబ్.. ఈ పేరు భారత క్రికెట్ అభిమానులకు బాగా గుర్తుండి ఉంటుంది. ఆసియా కప్ లో బంగ్లాదేశ్ నుంచి అరంగేట్రం చేసిన ఈ యంగ్ క్రికెటర్.. కెప్టెన్ రోహిత్ శర్మ, తిలక్ వర్మల వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్శించాడు. చివరి ఓవర్లో అద్భుత స్పెల్ వేసి బంగ్లాకు విజయాన్ని అందించాడు. ప్రస్తుతం ఈ యంగ్ ప్లేయర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డాడు. మహిళలు ఉద్యోగం చేస్తే సమాజం నాశనం అవుతుందని హసన్ షకీబ్ అన్నాడు. ఈ కామెంట్స్ దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి.

20 ఏళ్ళ ఈ పేసర్.. తాజాగా స్త్రీలను కించపరిచేలా కొన్ని పోస్టులు పెట్టాడు. బంగ్లాదేశ్ జట్టు జర్సీలు తయారుచేసే కర్మాగారంల్లో మహిళలే ఎక్కువగా పనిచేస్తున్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు చేసినందుకు గానూ తంజీమ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ‘భార్య పనిచేస్తే భర్త, పిల్లల హక్కులకు భరోసా ఉండదు. భర్త గాంభీర్యం దెబ్బతింటుంది. కుటుంబం నాశనం అవుతుంది’ అంటూ తంజీమ్ పోస్ట్ పెట్టాడు. సమాజంలో స్త్రీలు ఇప్పుడిప్పుడే రాణిస్తుంటే.. కుర్రాడై ఉండి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై పలు సంఘాలు మండిపడుతున్నాయి. బోర్డ్ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.



Updated : 20 Sep 2023 4:11 PM GMT
Tags:    
Next Story
Share it
Top