Home > క్రీడలు > IPL 2024 : బీసీసీఐకు కాసుల పంట.. టాటాకే మళ్లీ ఐపీఎల్ స్పాన్సర్ రైట్స్..!

IPL 2024 : బీసీసీఐకు కాసుల పంట.. టాటాకే మళ్లీ ఐపీఎల్ స్పాన్సర్ రైట్స్..!

IPL 2024 : బీసీసీఐకు కాసుల పంట.. టాటాకే మళ్లీ ఐపీఎల్ స్పాన్సర్ రైట్స్..!
X

ప్రపంచ ఫ్రాంచైజీ లీగ్‌ల్లో అగ్రస్థానంలో ఉన్న ఐపీఎల్‌ ఆటలోనే కాదు ఆదాయంలోనూ తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తోంది. అందుకే ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌ రైట్స్ కోసం దిగ్గజ కంపెనీలు తీవ్రంగా పోటీపడుతుంటాయి. ఈ క్రమంలో ఐపీఎల్కు సంబంధించి వచ్చే ఐదేళ్ల టైటిల్ హక్కులను టాటా గ్రూప్ చేజిక్కించుకుంది. దీంతో మరో ఐదేండ్ల పాటు అంటే 2028 వ‌ర‌కు టాటానే టైటిల్ స్పాన్స‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నుంది. ఈ మేర‌కు బీసీసీఐ, టాటా గ్రూప్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ అగ్రిమెంట్ ప్ర‌కారం బీసీసీఐకి కోట్ల రూపాయ‌లు చెల్లించ‌నుంది.

ఒప్పందం ప్రకారం టాటా కంపెనీ ఇకపై ప్రతి ఐపీఎల్ సీజన్ కు రూ.500 కోట్లు ముట్టజెప్పనుంది. దీంతో పాటు ఇన్విటేష‌న్ టు టెండ‌ర్ నిబంధ‌న‌ల ప్ర‌కారం టాటా గ్రూప్ భార‌త్‌కు చెందిన మ‌రో కార్పొరేట్ కంపెనీ ఆఫ‌ర్‌ను అంగీకరించొచ్చు. టైటిల్ స్పాన్సర్ షిప్ కింద ఆదిత్య బిర్లా గ్రూప్ కూడా బిడ్ దాఖలు చేసింది. ఈ హక్కుల కోసం ఒక్కోసీజన్ కు రూ. 500 కోట్ల చొప్పున మొత్తం రూ.2,500 కోట్లు బిడ్ వేసింది. టాటా సన్స్ సైతం అదే మొత్తానికి బిడ్ దాఖలు చేయగా.. చివరకు టాటా సన్స్ ఛాన్స్ కొట్టేసింది.

2022లో టాటా కంపెనీ తొలిసారి ఐపీఎల్ టైటిల్ స్పాన్స‌ర్ రైట్స్ ద‌క్కించుకుంది. చైనాకు చెందిన వివో కంపెనీ టైటిల్ స్పాన్స‌ర్‌గా వైదొల‌గ‌డంతో టాటాకు ఛాన్స్ దక్కింది. అప్పట్లో ప్ర‌తి సీజ‌న్‌కు బీసీసీఐకి రూ.365 కోట్లు చెల్లించేందుకు టాటా అంగీక‌రించింది.తాజాగా ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ కోసం ఐపీఎల్ నిర్వాహకులు బిడ్డింగ్ నిర్వహించగా.. 2028 వరకు ఆ రైట్స్ ను టాటా కంపెనీ దక్కించుకుంది.

ఇదిలా ఉంటే పీఎల్ 17వ సీజ‌న్ మార్చి 22 నుంచి ప్రారంభంకానుంది. ఇప్ప‌టికే వేలం ముగిసింది. కొన్ని ఫ్రాంచైజీలు కొత్త కోచ్‌ల‌ను నియ‌మించుకున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క‌సారి కూడా టైటిల్ గెల‌వ‌ని రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, ఢిల్లీ క్యాపిట‌ల్స్, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్‌లు ఈసారి విజేత‌గా నిల‌వాల‌నే క‌సితో ఉన్నాయి. ఐపీఎల్ 2024 సీజన్‌లో 74 మ్యాచ్‌లు జరుగుతాయి. అయితే 2025 నుంచి మ్యాచ్‌ల సంఖ్యను 84కు పెంచాలని నిర్వాహకులు భావిస్తున్నారు.




Updated : 20 Jan 2024 12:44 PM IST
Tags:    
Next Story
Share it
Top