IND vs PAK: టీమిండియా బ్యాటర్ల అతిపెద్ద సమస్య.. ఇప్పుడు బయటపడింది!
X
ఆసియా కప్ లో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటర్లు దారుణంగా విఫలం అయ్యారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్ మన్ గిల్ నిరాశ పరిచారు. ఈ మ్యాచ్ తో టీమిండియా బ్యాటర్ల అతిపెద్ద సమస్య బయటపడింది. పాకిస్తాన్ మ్యాచ్ అని కాదు ఏ టోర్నీ అయినా, ఏ జట్టైనా.. అదే సమస్య రిపీట్ అవుతుంది. మళ్లీ మళ్లీ బోల్తా పడుతున్నారు. 2022లో జరిగిన ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ లో చూసుకుంటే పాక్ తో ఆడిన రెండు మ్యాచుల్లో లెఫ్ట్ ఆర్మ్ సీమర్ షాహిన్ అఫ్రిది బౌలింగ్ లో ఏ విధంగా ఔట్ అయ్యారో తెలిసిందే. ఆ రెండు మ్యాచుల్లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఒకేలా ఔట్ అయ్యారు. శనివారం (సెప్టెంబర్ 2) జరిగిన మ్యాచ్ లో కేఎల్ రాహుల్ స్థానంలో విరాట్ కోహ్లీ అదే స్టైల్ లో ఔట్ అయ్యాడు. ఇక శుభ్ మన్ గిల్ 32 బంతులు ఎదుర్కోవడంలో ఎంత తడబడ్డాడో తెలిసిందే. దీంతో అసలు సమస్య ఏంటనేది తెలిసొచ్చింది.
టీమిండియా అతిపెద్ద ముప్పు ఒత్తిడి. దాంతో పాటు ఈ కొత్త సమస్య అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్లను ఎదుర్కోవడంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య 2022 నుంచి.. ఒక్క షామిన్ అఫ్రిదితో ఎదురైంది కాదు. గతంలో కూడా ఇదే సమస్య రిపీట్ అయింది. 2015 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ లో మిచెల్ జాన్సన్, 2017 ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో మహమ్మద్ అమీర్, 2019 వరల్డ్ కప్ సెమీస్ లో ట్రెంట్ బౌల్ట్, 2022 టీ20 వరల్డ్ కప్, ఆసియా కప్ లో షాహిన్ అఫ్రిదీ.. ప్రతీ టోర్నీలో ఓ లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ కు బలి అవుతున్నారు. వాళ్ల టెక్నిక్ ముందు బోల్తా పడి మనోళ్లు పెవిలియన్ బాట పడుతున్నారు.
2022ల నుంచి 18 వన్డేల్లో రోహిత్ శర్మ 5 సార్లు లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ కు ఔట్ అయ్యాడు. 22 ఇన్నింగ్స్ లు ఆడిన విరాట్ కోహ్లీ 4 సార్లు లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ కే ఔట్ అయ్యాడు. ఈ సమస్య విరాట్, రోహిత్ ఇద్దరిదే కాదు.. టీమిండియాది. 2022 నుంచి ఆడిన వన్డేల్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లు 16 వికెట్లు పడగొట్టారు. లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లపై మన బ్యాటర్ల సగటు 24.9 మాత్రమే. ఇవి చాలు మన జట్టు పరిస్థతి ఎంత పెద్ద ముప్పులో ఉందో. మరో నెలలో వరల్డ్ కస్ మొదలపుతున్న నేపథ్యంలో.. టీమిండియా వెన్నెముక అయిన రోహిత్, కోహ్లీ ఇలా ఓ సమస్యతో విఫలం అవవడం ఆందోళన కల్గిస్తోంది. సమస్యలపై శ్రమించి వరల్డ్ కప్ లో రాణించాలని ఫాన్స్ ఆశిస్తున్నారు.