Home > క్రీడలు > Asia cup 2023: 49 ఏళ్ల వన్డే క్రికెట్లో.. టీమిండియా చెత్త రాకార్డ్

Asia cup 2023: 49 ఏళ్ల వన్డే క్రికెట్లో.. టీమిండియా చెత్త రాకార్డ్

Asia cup 2023: 49 ఏళ్ల వన్డే క్రికెట్లో.. టీమిండియా చెత్త రాకార్డ్
X

కొలంబో వేదికపై శ్రీలంకతో జరిగిన సూపర్ 4 మ్యాచ్ లో టీమిండియా చెత్త రికార్డ్ ను మూటగట్టుకుంది. మ్యాచ్ గెలిచినా.. భారత ఖాతాలో చెత్త రికార్డ్ చేరింది. పాకిస్తాన్ తో గెలిచి ఊపుమీదున్న భారత బ్యాటర్లు.. శ్రీలంకపై విజృంభిస్తారని అనుకున్నారంతా. కానీ చివరికి కథ అడ్డం తిరిగింది. శ్రీలంక స్పిన్నర్ల ధాటికి 213 పరుగులకే ఆలౌట్ అయింది. లంక కుర్ర స్పిన్నర్ దునిత్ వెల్లలగే (5 వికెట్లు) మాయకు టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ కుప్పకూలింది. తర్వాత అసలంక 4 వికెట్లు పడగొట్టాడు. తీక్షణకు ఒక వికెట్ దక్కింది. ఆ తర్వాత భారత బౌలర్లు చెలరేగడంతో శ్రీలంక 172 పరుగులకే ఆలౌట్ అయింది. 41 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది.





అయితే ఈ మ్యాచ్ లో గెలిచినా భారత్ ఖాతాలో చెత్త రికార్డ్ చేరింది. 49 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలో ఓ జట్టు మొత్తం.. స్పిన్ బౌలింగ్ లో ఔట్ అవ్వడం ఇదే మొదటిసారి. నిన్నటి భారత్ ఇన్నింగ్స్ లో భారత్ బ్యాటర్లంతా లంక స్పిన్ బౌలింగ్ లోనే ఔట్ అయ్యారు. వెల్లలాగె, తీక్షణ, అసలంక విజృంభించడంతో ఈ అరుదైన రికార్డ్ శ్రీలంక ఖాతాలో చేరింది. అంతేకాకుండా ప్రత్యర్థి జట్టును వరుసగా 14 సార్లు ఆలౌట్ చేసిన జట్టుగా నిలిచింది. అయితే వరుసగా వన్డేల్లో 13 విజయాలతో జైత్రయాత్ర కొనసాగిస్తున్న లంకను టీమిండియా అడ్డుకుంది. ఈ విజయంతో సూపర్ 4లో అడుగు పెట్టింది.




Updated : 13 Sep 2023 1:58 PM GMT
Tags:    
Next Story
Share it
Top