కొత్త జెర్సీలో మెరిసిపోతున్న టీమిండియా క్రికెటర్లు
X
భారత్ క్రికెటర్లు జెర్సీలో మెరిసిపోతున్నారు. ఇటీవల విడుదల చేసిన తెలుపు, నీలం రంగు కొత్త జెర్సీలో స్టార్ క్రికెటర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, గిల్, హార్దిక్ పాండ్యా, భారత్ మహిళ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తళుక్కుమన్నారు. ఆదిదాస్ జెర్సీలతో భారత్ ప్లేయర్స్ ఫోటోలు బీసీసీఐ విడుదల చేయగా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన ఫ్యాన్స్ కోహ్లీ, రోహిత్ లుక్స్ అదుర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొందరు జెర్సీ బాలేదంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రియల్ మాడ్రిడ్ జెర్సీ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఓవల్ మైదానం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఈ కొత్త జెర్సీలతో బరిలోకి దిగనుంది.
రెండు రోజుల కిందట భారత క్రికెట్ జట్టు కొత్త జెర్సీలను విడుదల చేశారు. టెస్టులు, టి20, వన్డే ఫార్మాట్‌లకు మూడు వేర్వేరు జెర్సీలను రూపొందించారు. ఈ మేరకు అడిడాస్‌తో బీసీసీఐ ఐదేళ్ల పాటు రూ.350 కోట్లకు డీల్ కుదుర్చుకోంది. 2028 వరకు ఈ ఒప్పందం కొనసాగనుంది. గతంలో స్పాన్సర్‌గా ఉన్న కిల్లర్ జీన్స్ కిట్ స్పాన్సర్ నుంచి వైదొలగడంతో బీసీసీఐ అడిడాస్ తో ఒప్పందం కుదుర్చుకుంది.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.