Home > క్రీడలు > Sarfaraz Khan : సోషల్ మీడియాలో ఒకటే చర్చ.. సర్ఫరాజ్ ఖాన్ ఎందుకంత స్పెషల్?

Sarfaraz Khan : సోషల్ మీడియాలో ఒకటే చర్చ.. సర్ఫరాజ్ ఖాన్ ఎందుకంత స్పెషల్?

Sarfaraz Khan : సోషల్ మీడియాలో ఒకటే చర్చ.. సర్ఫరాజ్ ఖాన్ ఎందుకంత స్పెషల్?
X

సర్ఫరాజ్ ఖాన్.. అరంగేట్ర మ్యాచ్ లో అదరగొట్టాడు. ఆడుతుంది మొదటి మ్యాచ్ అనే బెరుకు లేకుండా చెలరేగిపోయాడు. సులువుగా బౌండరీలు బాదుతూ.. క్లిష్టమైన బంతుల్ని చాకచక్యంగా ఎదుర్కొంటూ.. అద్భుత హాఫ్ సెంచరీ సాధించాడు. ఇన్నేళ్ల తన నిరీక్షణ, ఆకలిని ఈ మ్యాచ్ తో తీర్చుకున్నాడు. తనను ఎందుకు సెలక్ట్ చేయలేదని బ్యాటుతో ప్రశ్నించాడు. కేవలం 48 బంతుల్లోనే 50 పరుగులు పూర్తిచేసుకున్నాడు. రాజ్ కోట్ లో జరుగుతున్న మూడో టెస్టులో అరంగేట్రం చేసిన 26 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్ గురించే నిన్న చర్చంతా. ఐపీఎల్ లో పెద్దగా ఆడలేదు. పెద్దగా బ్యాక్ గ్రౌండ్ కూడా లేదు. అయితే ఎందుకింత స్పెషల్ అతను? ఇన్ని కోట్ల మంది అతని ఆట కోసం ఎందుకు వెయిట్ చేశారు? టెస్టుల్లో డెబ్యూ చేస్తుంటే.. తన తండ్రి ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నాడు? కెప్టెన్ రోహిత్ శర్మ స్వయంగా వెళ్లి వాళ్ల ఫ్యామిలీతో ఎందుకు మాట్లాడాడు? తొలిరోజు ఆట ముగిసిన తర్వాత టీమిండియా అభిమానుల్లో మెదలిన ప్రశ్నలివి.





సర్ఫరాజ్ ఖాన్ ఆవేదన అంతా ఇంతా కాదు. గతకొంత కాలంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో రాణిస్తున్నా.. జాతీయ జట్టులో ఎవరూ పట్టించుకోలేదు. తనకన్నా జూనియర్లు, పెద్దగా గుర్తింపు లేని ప్లేయర్లు కూడా టీమిండియాకు సెలక్ట్ అవుతున్నారు. దాంతో కసి పెరిగింది. సెలక్ట్ చేయట్లేదనే కోపం, బాధతో.. ఏమాత్రం కుంగి పోకుండా ఆటపైనే ఫోకస్ పెట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో సచిన్ లాంటి దిగ్గజాల సరసన నిలిచాడు. ఫలితం.. అయినా ఎవరూ పట్టించుకోలేదు. కారణం ఏంటని బ్యాటుతోనే ప్రశ్నించాడు. రాణించాడు. మెరుగైన ప్రదర్శన చేస్తూనే ఉన్నాడు. అయినా బీసీసీఐ మొండిచేయి చూపించింది. జట్టులో సెలక్ట్ చేసినా బెంచ్ కే పరిమితం చేసింది. ఈ టైంలో అతనికి అభిమానులు తోడయ్యారు. సోషల్ మీడియా వేదికగా అండగా నిలిచారు.






సచిన్ సరసన నిలిచినా:

భారత- ఎ జట్టు తరపున అవకాశం వచ్చిన ప్రతిసారి సర్ఫరాజ్‌ సత్తాచాటాడు. తాజాగా ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన తొలి అనధికార టెస్టులో హాఫ్ సెంచరీ సాధించాడు. అంతకుముందు వార్మప్ మ్యాచ్ లో 96 పరుగులు చేశాడు. ఇప్పటివరకూ 45 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 3912 పరుగులు సాధించాడు. అతని సగటు 69.85గా ఉండటం విశేషం. అందులో 14 శతకాలున్నాయి. అతని అత్యధిక స్కోరు 301 నాటౌట్‌. ఈ క్రమంలో గిల్ ను అధిగమించాడు. సచిన్ తర్వాత స్థానాన్ని ఆక్రమించాడు. ప్రతిభపరంగా, నైపుణ్యాల పరంగా, ఆట పరంగా సర్ఫరాజ్‌పై ఎలాంటి సందేహాలు లేవు. కానీ భారత జట్టులో తీవ్రమైన పోటీ కారణంగా ఇన్ని రోజులూ చోటు దక్కలేదు.






ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అత్యధిక బ్యాటింగ్‌ సగటు ఉన్న బ్యాటర్లు:

వినోద్ కాంబ్లీ - 88.37 (27 మ్యాచ్‌లు)

ప్రవీణ్ ఆమ్రే - 81.23 (23 మ్యాచ్‌లు)

యశస్వి జైస్వాల్ - 80.21 (15 మ్యాచ్‌లు)

రుషి మోదీ- 71.28 (38 మ్యాచ్‌లు)

సచిన్ టెండుల్కర్ - 70.18 (9 మ్యాచ్‌లు)

సర్ఫరాజ్ ఖాన్ - 69.85 (45 మ్యాచ్‌లు)

శుబ్‌మన్‌ గిల్ - 68.78 (23 మ్యాచ్‌లు)

లక్ కలిసొచ్చింది:

ఈ క్రమంలో టీమిండియా ప్లేయర్లకు వరుస గాయాలయ్యాయి. కేఎల్ రాహుల్ గాయం తిరగబడి జట్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో మూడో టెస్టులో ఆడే అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్న సర్ఫరాజ్.. అరంగేట్ర మ్యాచ్ లో అదరగొట్టాడు. ఈ సందర్బంగా టీమిండియా సర్పరాజ్ చరిత్ర సృష్టించారు. భారత్ తరపున అరంగేట్రం చేసేనాటికి.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక సగటు కలిగి ఉన్న బ్యాటర్లలో ఆరు స్థానం నిలిచాడు. ఇక దేశావాళీ, రంజీ ట్రీఫీల్లో అతని ప్రదర్శన అద్భుతం. ఎన్నో రికార్డులను తన పేరిట రాసుకున్నాడు. జాతీయ జట్టులో కూడా సత్తాచాటి, రానున్న రోజుల్లో పైకెదగాలని అభిమానులు ఆశిస్తున్నారు.







Updated : 16 Feb 2024 8:21 AM GMT
Tags:    
Next Story
Share it
Top