Team India Emotional Video : బరువెక్కిన గుండెలు.. డ్రెస్సింగ్ రూం వీడియో
X
ఎంత బాధ.. ఎంత వేదన. శిఖరం నుంచి లోయలో పడ్డ భావన. అద్భుతమైన ఆరంభానికి.. పీడకల లాంటి ముగింపు. సొంతగడ్డపై కప్పు గెలిచే మహా అవకాశం చేజారింది. కోట్ల మంది స్వప్నం చెదిరింది. 11 మ్యాచుల్లో ఆల్ రౌండ్ ప్రదర్శన చేసి.. ప్రత్యర్థికి ముప్పుతిప్పలు పెట్టిన టీమిండియా ఆఖరి మ్యాచ్ లో తడబడింది. ఆస్ట్రేలియా ఒత్తడి ముందు బోల్తాకొట్టింది. వ్యూహాలేవి ఫలించకపోగా.. పరిస్థితులు కూడా టీమిండియాపై పగబట్టాయి. ఎప్పటిలాగే భారత్ పై ఆధిపత్యం ప్రదర్శించిన ఆసీస్ కప్పు ఎగరేసుకుపోయింది. ఈ ఓటమితో ఆటగాళ్లంతా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కొందరు కంటతడిపెట్టుకున్నారు. సపోర్ట్ స్టాఫ్, కోచ్ ఇలా ప్రతీ ఒక్కరి ముఖాల్లో నిరాశే కనిపించింది.
మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూం మొత్తం బరువెక్కిన గుండెలతో నిండిపోయింది. నిరాశతో ఎక్కడివారక్కడే నిలిచిపోయారు. కాగా ఫీల్డింగ్ కోచ్ మాత్రం ఆటగాళ్లలో సంతోషాన్ని నింపే ప్రయత్నం చేశాడు. ప్రతీ మ్యాచ్ లాగే ఈ మ్యాచ్ అనంతరం కూడా.. బెస్ట్ ఫీల్డర్ మెడల్ సత్కరిస్తూ కొంత బాధను దూరం చేసే ప్రయత్నం చేశాడు. ఆటలంటేనే.. గెలుపు ఓటములని చెప్తూ.. వారిలో స్పూర్తి నింపే ప్రయత్నం చేశాడు. కాగా ఫైనల్ మ్యాచ్ బెస్ట్ ఫీల్డర్ గా విరాట్ కోహ్లీకి మెడల్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను ‘బీసీసీఐ టీవీ’లో పోస్ట్ చేసింది. ఇప్పటికే తీవ్ర భావోద్వేగంలో ఉన్న అభిమానులు ఆ వీడియో చూసి మరింత ఎమోషనల్ అవుతున్నారు.
ఓపెన్ లింక్ ..😞😞👇
https://www.bcci.tv/video/5560589/dressing-room-bts--final--fielder-of-the-match?tagNames=bcci