Home > క్రీడలు > ‘కెప్టెన్గా దిగిపో.. లేదంటే రిటైర్ అయిపో’.. రోహిత్ శర్మపై ఫ్యాన్స్ ఆగ్రహం

‘కెప్టెన్గా దిగిపో.. లేదంటే రిటైర్ అయిపో’.. రోహిత్ శర్మపై ఫ్యాన్స్ ఆగ్రహం

‘కెప్టెన్గా దిగిపో.. లేదంటే రిటైర్ అయిపో’.. రోహిత్ శర్మపై ఫ్యాన్స్ ఆగ్రహం
X

డబ్లూటీసీ ఫైనల్ లో టీమిండియా ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ ఉన్న టీం కనీసం పోరాడకుండా ఆసీస్ బౌలర్లకు చేతులెత్తేసి 209 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ విషయంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటమికి తొలి బాధ్యుడు రోహిత్ అని భావిస్తూ టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నాడు. అంతేకాదు #Retire, #Rohitsharma అంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ క్రియేట్ చేశారు. దీంతో రోహిత్ పై ఏ రేంజ్ లో కోపం ఉందో అర్థమవుతోంది.

‘నువ్వు కెప్టెన్ గా పనికి రావు. ఐపీఎల్ లో కప్పులు కొట్టావని కెప్టెన్సీ ఇస్తే.. దారుణంగా విఫలం అవుతున్నావు. బ్యాట్స్ మెన్ గా పనికి రావట్లేదు. నీకు చేతకాకపోతే దిగిపో. లేదంటే రిటైర్ అయిపో’అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బౌలింగ్, ఫీల్డింగ్ లో కూడా జట్టును లీడ్ చేయలేకపోయాడు రోహిత్. బ్యాట్స్ మెన్ గా ఒక్క మ్యాచ్ లో రాణించలేదు. గత కొన్ని సిరీసుల నుంచి రోహిత్ ఫేల్ అవుతున్నాడు. బాధ్యతగా ఆడాల్సిన ప్రతీసారి నిర్లక్ష్యం వ్యవహరించి వికెట్ పారేసుకున్నాడు.

ట్రోఫీ తెస్తాడనే నమ్మకంతో కోహ్లీ నుంచి కెప్టెన్సీ అప్పగిస్తే అన్నింట్లో ఫెయిల్ అయ్యాడు. ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్, టెస్ట్ ఛాంపియన్ షిప్, కొన్ని సిరీసుల్లో దారుణంగా ఓడిపోయింది టీమిండియా. మరో నాలుగు నెలల్లో వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ టైంలో రోహిత్ కెప్టెన్సీ జట్టుకు భారంగా మారింది. ఇక్కడ కూడా రోహిత్ ఫెయిల్ అయితే.. కెప్టెన్సీ పోవడమే కాదు.. కెరీర్ కు ఎండ్ కార్డ్ పడుతుంది.


Updated : 12 Jun 2023 10:51 AM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top