Home > క్రీడలు > విరాట్ కోహ్లీ మీద కోపంతో.. టీమిండియాను తక్కువ చేస్తున్నడు

విరాట్ కోహ్లీ మీద కోపంతో.. టీమిండియాను తక్కువ చేస్తున్నడు

విరాట్ కోహ్లీ మీద కోపంతో.. టీమిండియాను తక్కువ చేస్తున్నడు
X

టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఎప్పుడు ఎలా మాట్లాడుతాడో ఊహించడం కష్టం. ఒకసారి టీమిండియాకు మద్దతునిస్తాడు. మరోసారి ప్రత్యర్థి ఆటగాళ్లను పొగుడుతాడు. మనవాళ్ల మీద కోపంతో.. పక్కవాళ్లను సపోర్ట్ చేస్తాడు. తాజాగా గంభీర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. గంభీర్ ఉద్దేశ్యం ఏదైనా.. అతను చేసే కామెంట్స్ మాత్రం బోల్డ్ గా ఉంటాయి. వాటితోనే ఎప్పుడూ వివాదాల్లో నిలుస్తుంటాడు. తాజాగా స్టార్ స్పోర్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంను తెగ ప్రశంసించాడు. టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను తక్కువ చేసి మాట్లాడాడు.

‘బాబర్ ఆజంకు ఎలాంటి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అతను ఇప్పికే 104 వన్డేలు ఆడాడు. 19 సెంచరీలు చేశాడు. అతనికి ఎలా ఆడాలో తెలుసు. విమర్శలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వరల్డ్ కప్ లో కోహ్లీ, రోహిత్, వార్నర్ లన్నా మెరుగ్గా రాణిస్తాడు. చెలరేగిపోతాడు. టోర్నీలో అతని హవానే నడుస్తుంది’ అంటూ ప్రశంసించాడు. అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ నవీన్ ఉల్ హక్ కు తన పూర్తి మద్దతునిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. దానికి కోహ్లీ ఫ్యాన్స్ గంభీర్ పై ఫైర్ అవుతున్నారు. ఐపీఎల్ 2023లో కోహ్లీకి.. గంభీర్, నవీన్ ల మధ్య చెలరేగిన వివాదం గురించి తెలిసిందే. ఇక అప్పటి నుంచి చాన్స్ దొరికిన ప్రతీసారి నవీన్ కు మద్దతునిస్తూ.. కోహ్లీని తక్కువ చేసి మాట్లాడాడు. దాంతో కోహ్లీ ఫ్యాన్స్ గంభీర్ పై పీకల్లోతు కోపంతో ఉన్నారు. ఇక తాజాగా నవీన్ పుట్టిన రోజు సందర్భంగా.. ‘హ్యాపీ బర్త్ డే నవీన్.. నీలాంటి వాళ్ల కొంతమందే ఉంటారు. నువ్వెప్పటికీ మారకు’ అంటూ పోస్ట్ పెట్టాడు.

దీంతో గంభీర్ పై టీమిండియా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఫామ్ లో లేని మంచి ప్లేయర్లకు మద్దతునివ్వడంలో తప్పు లేదు కానీ.. ఇలా తప్పు చేసిన ప్లేయర్ ను సమర్థించడం కరెక్ట్ కాదంటూ కామెంట్ చేస్తున్నారు. కోహ్లీ మీద కోపం ఉంటే మిగతా ఆటగాళ్లను కించపరచడం తప్పు అంటూ ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం వన్డే నెంబర్ వన్ బ్యాటర్ గా ఉన్న బాబర్ కు సమీపంలో గిల్ ఉన్నాడు. అతన్ని పొగడాల్సింది పోయి పక్కదేశపు క్రికెటర్ ను మెచ్చుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.


Updated : 23 Sept 2023 7:18 PM IST
Tags:    
Next Story
Share it
Top