Home > క్రీడలు > India vs England : మరో ఇద్దరికి గాయాలు.. టీం సెలక్షన్లో ఇబ్బందులు.. రెండో టెస్టుకు ముందు రోహిత్కు సవాళ్లెన్నో..!

India vs England : మరో ఇద్దరికి గాయాలు.. టీం సెలక్షన్లో ఇబ్బందులు.. రెండో టెస్టుకు ముందు రోహిత్కు సవాళ్లెన్నో..!

India vs England : మరో ఇద్దరికి గాయాలు.. టీం సెలక్షన్లో ఇబ్బందులు.. రెండో టెస్టుకు ముందు రోహిత్కు సవాళ్లెన్నో..!
X

(India vs England) సొంతగడ్డపై టెస్ట్ సిరీస్.. మన పిచ్ లపై ఇంగ్లాండ్ కు ఆధిపత్యం ఏమాత్రం లేదు. పైగా అశ్విన్, జడేజా లాంటి ప్రస్తుత మేటి స్పిన్నర్లు జట్టులో ఉన్నారు. స్టార్ బ్యాటర్లు. ఉప్పల్ వేదికపై జైత్రయాత్ర. అయినా టీమిండియా మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఓడిపోయింది. మొదటి రెండు రోజులు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భారత్.. తర్వాత తేలిపోయింది. స్పిన్నర్లు ఫెయిల్ అవ్వడం, బ్యాటర్ల నిర్లక్ష్యంతో మొదటి టెస్ట్ మ్యాచ్ ను ఇంగ్లాండ్ కు సమర్పించారు. దాంతో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో ఇంగ్లాండ్ 0-1తో ఆధిక్యంలో ఉంది. కాగా ఇవాళ (ఫిబ్రవరి 1) విశాఖపట్నం వేదికగా జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్ కు కఠిన సవాళ్లకు సిద్ధమయ్యారు.





బ్యాటింగ్‌ మెరుగవ్వాలి:

భారత బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉన్నా... మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఒక్కరు కూడా సెంచరీ చేయలేకపోయారు. తొలి ఇన్నింగ్స్ లో ముగ్గురు బ్యాటర్లు 80+, మరో ముగ్గురు బ్యాటర్లు 50+ పరుగులు మాత్రమే చేయగలిగారు. నిలబెట్టాల్సిన ఇన్నింగ్స్ లో తొందపాటుతో బోల్తాపడ్డారు. ఇక రెండో ఇన్నింగ్స్ లో ప్రతీ బ్యాటర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. తయ తప్పిదాలతో మ్యాచ్ ను ఇంగ్లాండ్ కు ఇచ్చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ ఫెయిల్ అవ్వడం జట్టును ఇబ్బంది పెట్టింది. ఇక మూడో వికెట్ లో వచ్చిన శుభ్ మన్ గిల్ రెండు ఇన్నింగ్స్ లో దారుణంగా నిరాశపరిచాడు. ఫామ్ కోల్పోయి జట్టుకు భారంగా మారుతున్నాడు. శ్రేయస్ అయ్యర్ పరవాలేదనిపించినా.. అతని తొందరపాటుతో ఔట్ అయిపోతున్నాడు. వీరు ఫామ్ లోకి వస్తే.. భారత్ కు తిరుగు ఉండదు.

స్పిన్నర్లు రాణించాలి:

ప్రస్తుతం టీమిండియాలో ఉన్న ముగ్గురు స్పిన్నర్లు మేటి ఆటగాళ్లు. పైగా టెస్ట్ ఆల్ రౌండర్లు కూడా. అయినా.. లాభం లేకపోయింది. అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ లాంటి స్పిన్నర్లు సొంతగడ్డపై వికెట్లు తీయలేకపోవడం జట్టుకు ఇబ్బంది కలిగించే విషయమే. అశ్విన్ 29 ఓవర్లలో 3 వికెట్లు తీయగా, జడేజా 34ఓవర్లలో 2, 16 ఓవర్లు వేసిన అక్షర్ ఒక వికెట్ పడగొట్టాడు. బౌలింగ్ లోనే కాకుండా బ్యాటింగ్ లో వీరు రాణించాల్సి ఉంది. ఇక రెండో ఇన్నింగ్స్ లో మాత్రం దారుణంగా విఫలం అయ్యారు. వీళ్ల బౌలింగ్ లో ఓలీ పోప్ అలవోకగా సిక్సర్లు బాదాడు. అదే పిచ్ పై ఇంగ్లాండ్ స్పిన్నర్ టామ్ హార్ట్ లే చెలరేగి ఏడు వికెట్లు తీసుకున్నాడు.

కీలక ఆటగాళ్లు దూరం:

ఇప్పటికే జట్టులో విరాట్ కోహ్లీ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు మరో ఇద్దరు ఆటగాళ్లు జట్టుకు దూరం కానున్నారు. గాయాల కారణంగా కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా రెండో టెస్ట్ కు దూరం కానున్నారు. కోహ్లీతో పాటు వీరిద్దరు కూడా దూరం కావడం జట్టు కూర్పు కష్టంగా మారింది. బ్యాటింగ్ లో దేశవాళీలో రాణిస్తున్న రజత్ పటీదార్ ఉన్నాడు. తాజాగా సర్ఫ్ రాజ్ ఖాన్ ను జట్టులోకి తీసుకున్నారు. కానీ బౌలింగ్ జడేజాకు రీప్లేస్ గా ఎవరిని దింపుతారని ఉత్కంఠ. ఇలాంటి ప్రతికూల అంశాలనుంచి టీమిండియా ఎలా బయటపడుతుంది? విశాఖ టెస్ట్ ఎలా గెలుస్తుందో చూడాలి.








Updated : 1 Feb 2024 2:29 AM GMT
Tags:    
Next Story
Share it
Top